Manorathangal OTT: కమల్, మోహన్ లాల్, మమ్ముట్టి కాంబోలో క్రేజీ వెబ్ సిరీస్… ఓటీటీ రిజల్ట్ ఏమిటో తెలుసా? ఊహించి ఉండరు!

ఒక్కోసారి భారీ క్యాస్ట్ నటించినా సరైన బజ్ క్రియేట్ కాకపోవచ్చు. ఇటీవల విడుదలైన ఓ క్రేజీ యాంథాలజీ సీరిస్ కి కనీస ఆదరణ కరువైంది. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి టాప్ స్టార్స్ ఈ సిరీస్లో భాగమయ్యారు. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..

Written By: S Reddy, Updated On : August 19, 2024 2:17 pm

Manorathangal OTT

Follow us on

Manorathangal OTT: 2024 ఆగస్టు 15 గోల్డెన్ రిలీజ్ డేట్. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ తో పాటు సోమవారం రాఖీ పౌర్ణమి. మొత్తంగా ఐదు రోజులు బాక్సాఫీస్ కుమ్ముకోవచ్చు. ఈ క్రమంలో మూడు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో పాటు డబ్బింగ్ మూవీ తంగలాన్ థియేటర్స్ లోకి వచ్చాయి. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. తంగలాన్ మెరుగైన టాక్ సొంతం చేసుకుంది. వీటితో పాటు విడుదలైన చిన్న చిత్రం ఆయ్ మంచి వసూళ్లు రాబడుతుంది.

ఇండిపెండెన్స్ డే కానుకగా ఓటీటీలోకి పలు చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో మలయాళ యాంథాలజీ సిరీస్ మనోరతంగల్ ఒకటి. ఈ సిరీస్ మలయాళ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కించారు. మలయాళ లెజెండరీ రచయిత ఎమ్ టీ వాసుదేవన్ నాయర్ రచించిన కథల ఆధారంగా మనోరతంగల్ సిరీస్ రూపొందింది. మొత్తం 9 ఎపిసోడ్స్ తో కూడిన ఫస్ట్ సీజన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

మనోరతంగల్ యాంథాలజీ సిరీస్లో మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహద్ ఫజల్, పార్వతి తిరువొత్తు, అపర్ణ బాలమురళి, బిజూ మీనన్, అసిఫ్ అలీ, నదియా తో పాటు మరికొందరు స్టార్ క్యాస్ట్ నటించారు. 9 ఎపిసోడ్స్ కి 9 మంది దర్శకులు పని చేశారు. ప్రియదర్శన్, రంజిత్, శ్యామ ప్రసాద్, మహేష్ నారాయణన్, జయ రాజ్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి వై నాయర్ ఒక్కో ఎపిసోడ్ కి దర్శకత్వం వహించారు.

కమల్ హాసన్ ఈ యాంథాలజీ సిరీస్ కి ప్రజెంటర్ గా ఉన్నారు. జీ 5లో మనోరతంగల్ స్ట్రీమ్ అవుతుంది. కాగా మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్ వంటి స్టార్ క్యాస్ట్ భాగమైన మనోరతంగల్ సిరీస్ కి కనీస ఆదరణ కరువైంది. ఓటీటీలో మనోరతంగల్ కి పూర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రతిష్టాత్మకంగా మనోరతంగల్ యాంథాలజీ సిరీస్ ని రూపొందించారు. అయితే ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్ ని పట్టించుకోవడం లేదు.

సరైన ప్రమోషన్స్ నిర్వహించకపోవడం కూడా ఒక కారణం. బడా స్టార్స్ సినిమాలకు కూడా ప్రమోషన్స్ తప్పనిసరి. జనాల్లోకి మన ప్రాజెక్ట్ ని తీసుకెళ్లాలి. ఓటీటీ సిరీస్లు, సినిమాల విషయంలో మరింత కేర్ఫుల్ గా ఉండాలి. స్టార్ హీరోలు నటించారు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రచారం దక్కుతుంది అనుకుంటే పొరపాటే. మనోరతంగల్ యాంథాలజీ సిరీస్ మేకర్స్ ఇదే మిస్టేక్ చేశారు.

కనీసం మలయాళం లో కూడా భారీగా ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు. ఇతర భాషల్లో ఇక సరేసరి. మనోరతంగల్ టీమ్ కి ఇది భారీ షాక్ అని చెప్పాలి. జీ 5 సంస్థ సైతం మనోరతంగల్ యాంథాలజీ సిరీస్ కి వస్తున్న రెస్పాన్స్ కి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. యాంథాలజీ జోనర్లో హారర్, బోల్డ్ సబ్జక్ట్స్ ఆదరణ దక్కించుకున్నాయి. మనోరతంగల్ ఫీల్ గుడ్ ఎమోషనల్ కంటెంట్ తో యాంథాలజీ సిరీస్.