Pawan Kalyan – Ravi Teja : సౌత్ ఇండియా లో లెజెండరీ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే మనకి గుర్తు వచ్చే డైరెక్టర్స్ లో ఒకరు మణిరత్నం. ఆయనతో సినిమా చేయాలనీ ప్రతీ సూపర్ స్టార్ కి ఒక కోరిక ఉంటుంది. ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఇమేజి ఏమాత్రం చెక్కు చెదరలేదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తో భారీ హిట్స్ అందుకొని కం బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కమల్ హాసన్ తో ‘తుగ్ లైఫ్’ అనే చిత్రాన్ని తీస్తున్నాడు. రజినీకాంత్ తో కూడా ఒక సినిమా ఖరారు అయ్యింది. ఇదంతా పక్కన పెడితే మణిరత్నం కాంబినేషన్స్ లో అప్పట్లో చాలా మల్టీస్టార్ర్ర్ చిత్రాలు తెరకెక్కాయి. అలా ఆయన అప్పట్లో తీసిన మల్టీస్టార్రర్ చిత్రాలలో ‘యువ’ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమాని తమిళం లో ఆయన సూర్య,మాధవన్ కాంబినేషన్ లో తీయగా, హిందీ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్ లో తీసాడు.
అలాగే తెలుగు లో ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేషన్ లో చేయాలని అనుకున్నాడు. కానీ చివరి నిమిషం లో కుదర్లేదు. తమిళం లో సూర్య పోషించిన పాత్రని పవన్ కళ్యాణ్ తో, మాధవన్ పోషించిన పాత్రని రవితేజ తో చేయాలని ప్లాన్ చేసాడు. ఇద్దరి హీరోలకు కథ వినిపించాడు, ఇద్దరికీ నచ్చింది కూడా. కానీ షూటింగ్ కి వెళ్లే ముందు ఎందుకో ఈ సినిమా తెలుగు లో స్టార్స్ తో తీస్తే వర్కౌట్ అవ్వదేమో అని పవన్ కళ్యాణ్ అన్నాడట. పూర్తి స్థాయి సంతృప్తి చెందకపోతే ఈ కథ చెయ్యొద్దు, వేరే కథ చేద్దాం అన్నాడట మణిరత్నం. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకముందే అట్టకెక్కింది. అయితే తమిళం లో విడుదలై పెద్ద సూపర్ హిట్ అవ్వగానే, తెలుగు లో కూడా దబ్ చేసి విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. పాటలకు కూడా మన ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య తెలుగు ప్రేక్షకులకు మొట్టమొదటిసారి పరిచయమైంది ఈ చిత్రంతోనే.
ఆల్ టైం క్లాసిక్ వేల్యూ ని సంపాధించుకున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్, రవితేజ చేసుంటే నిజంగానే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యేది కాదేమో. ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టార్స్, ఈ సినిమా మొత్తం స్లో పేస్ లో నడుస్తుంది. మణిరత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ అంచనాలతో ఈ చిత్రం విడుదల అయ్యుంటే ఫ్లాప్ అయ్యేది, కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమాని క్యాన్సిల్ చేసి మంచి పనే చేసాడని సోషల్ మీడియా లో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అంటున్నారు. తెలుగు లో ఈ చిత్రం అప్పట్లో మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి సూపర్ హిట్ గా నిల్చింది.