https://oktelugu.com/

Vishwam Movie Collections : వర్కింగ్ డేస్ లోనూ తగ్గని గోపీచంద్ ‘విశ్వం’ జోరు..4 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

విడుదల తర్వాత కూడా ఈ చిత్రం రొటీన్ అనే టాక్ ని తెచ్చుకుంది. కానీ శ్రీను వైట్ల రాసుకున్న కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అవి బాగా పేలడంతో ఈ చిత్రానికి ఆరంభంలో ఓపెనింగ్ వసూళ్లు బాగా తగ్గినా, రెండవ రోజు నుండి వసూళ్లు పుంజుకున్నాయి. మొదటి మూడు రోజులు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 07:40 PM IST

    Vishwam Movie Collections

    Follow us on

    Vishwam Movie Collections :  చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ , శ్రీను వైట్ల కలిసి చేసిన ‘విశ్వం’ చిత్రం ఇటీవలే దసరా కానుకగా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ని చూసి రొటీన్ శ్రీను వైట్ల సినిమా లాగానే ఉంది, ఇది కూడా ఫ్లాప్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. విడుదల తర్వాత కూడా ఈ చిత్రం రొటీన్ అనే టాక్ ని తెచ్చుకుంది. కానీ శ్రీను వైట్ల రాసుకున్న కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. అవి బాగా పేలడంతో ఈ చిత్రానికి ఆరంభంలో ఓపెనింగ్ వసూళ్లు బాగా తగ్గినా, రెండవ రోజు నుండి వసూళ్లు పుంజుకున్నాయి. మొదటి మూడు రోజులు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది.

    ముఖ్యంగా దసరా రోజు రోజు అయితే మొదటి రోజు కంటే రెండింతలు లాభాలను రాబట్టింది. అయితే సోమవారం నుండి ఈ సినిమా వసూళ్లు తగ్గిపోతాయని అందరూ అనుకున్నారు. కానీ సోమవారం కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి మూడు రోజులు నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. కానీ ఇదంతా కేవలం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుండి వస్తున్న వసూళ్లు మాత్రమే. కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాల నుండి కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదు. ఓవర్సీస్ లో ఒకప్పుడు శ్రీను వైట్ల ఒక బ్రాండ్. మన టాలీవుడ్ కి మొట్టమొదటి 1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన సినిమా శ్రీను వైట్ల నుండి వచ్చినదే. ఆయన దర్శకత్వం వహించిన ‘దూకుడు’ చిత్రం ఓవర్సీస్ లో ఒక సెన్సేషన్. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ ప్రారంభం అయ్యిందే శ్రీను వైట్ల కారణంగా అని చెప్పొచ్చు. అలాంటి డైరెక్టర్ కి ఇప్పుడు అక్కడ కనీసం లక్ష డాలర్లు కూడా రాకపోవడం శోచనీయం.

    ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ విశ్వం సినిమాకి కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి కేవలం 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. షేర్ వసూళ్లు కనీసం 20 లక్షల రూపాయిలు కూడా ఉండదు. టాలీవుడ్ కి అతి పెద్ద మర్కెట్స్ అయినటువంటి కర్ణాటక, ఓవర్సీస్ నుండి శ్రీనువైట్ల సినిమాకి ఇలాంటి చిల్లర రావడం అంటే, ఇక భవిష్యత్తులో ఆయనకీ స్టార్ హీరోలు అవకాశం ఇవ్వడం కష్టమే అని అనిపిస్తుంది. కానీ గోపీచంద్ కి మాత్రం ఈ సినిమా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. సరైన స్క్రిప్ట్స్ ఎంచుకొని ముందుకుపోతే గోపీచంద్ మళ్ళీ భారీ హిట్ కొట్టగలడు, ఆయన మార్కెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పోలేదు అనే విషయం ఈ సినిమా తో అందరికీ అర్థం అయ్యింది. చూడాలి మరి క్లోసింగ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.