Mangli Telangana Folk Song: ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వాటిలో ఫోక్ సాంగ్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఆల్బమ్స్ అయితే వస్తాయో ఫోక్ ఇండస్ట్రీ లో సైతం గొప్ప పాటలు వస్తున్నాయి. ఒక పాటను మించి మరొక పాట రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారి చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ సక్సెస్ అయిన ఫోక్ సాంగ్స్ ను సినిమాల్లో వాడుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ పడటంలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సంపాదించుకున్న మంగ్లీ తన వాయిస్ తోనీ కాకుండా తన స్టెప్పులతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఫోక్ ఇండస్ట్రీలో తన పాటతో ఆటతో ఆకట్టుకుంటున్న మంగ్లీ నుంచి మరొక కొత్త పాట వచ్చింది. ‘బాయి లోన బల్లి పలికే’ అనే సాంగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో సాంగ్ కనుక వచ్చినట్లయితే మాత్రం యూట్యూబ్ మొత్తం షేక్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆ ట్యూన్ కు తగ్గట్టుగా లిరిక్స్ అందించినట్టుగా తెలుస్తోంది… ప్రతి లిరిక్ లో కూడా తెలంగాణ భావాలు కనిపిస్తున్నాయి. ఫోక్ హిస్టరీ లోనే ఇలాంటి ఒక సాంగ్ రాలేదంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియో సాంగ్ కి కనుక గొప్ప గుర్తింపు లభిస్తే మాత్రం ఇంకా చాలా గొప్ప ఫోక్ సాంగ్స్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా మంగ్లీ నుంచి ప్రతి సంవత్సరం ఒకటి రెండు ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె చేస్తున్న సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఇటు ఫోక్ సాంగ్స్ చేస్తూనే దేవుళ్ళ పాటలను కూడా పాడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.
మంగ్లీ అంటే ప్రేక్షకుల్లో ఫోక్ సింగర్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పడిపోయింది. అప్పుడప్పుడు సినిమాల్లో పాటలు పాడుతున్నప్పటికి ఆమెకు ఫోక్ సింగర్ గానే మంచి ఐడెంటిటి దక్కుతోంది. ఇక దీన్ని కాపాడుకుంటూ ముందుకు వెళితే ఆమె ఫోక్ సింగర్ గా టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్లడం పక్కా అనేది కన్ఫామ్ గా తెలిసిపోతోంది… ఇక ఇలాంటి సాంగ్స్ రావడం వల్లే ఫోక్ ఇండస్ట్రీ కూడా ముందుకు వెళ్తోంది. అలాగే వీటి వల్ల మన పల్లె పాటలని, మట్టి వాసనని వెలికి తీసి చూసినా భావం కలుగుతోంది…
Another Banger from Telangana Folk Song loading ❤️ pic.twitter.com/8VPgxpnbAa
— Antara Reddy (@AntaraonX) November 13, 2025