Mangli Shivaratri Song 2025: మంగ్లీ టాలీవుడ్ స్టార్స్ సింగర్ గా ఉన్నారు. మంగ్లీ గాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె ఏ పాట పాడినా సూపర్ హిట్. పదుల సంఖ్యలో మంగ్లీ పాడిన సాంగ్స్ సంగీత ప్రియులను అలరించాయి. కాగా మంగ్లీ శివభక్తురాలు. శివరాత్రి పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. శివరాత్రి జాగారాల్లో శివుని పాటలతో భక్తులను పరమశివుని పారవశ్యంలో మునిగేలా చేస్తారు. అలాగే ప్రతి శివరాత్రికి మంగ్లీ ఒక శివుని పాట స్వయంగా పాడి విడుదల చేశారు. ఫిబ్రవరి 26న శివరాత్రి కాగా కొత్త పాటను మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశారు.
లేటెస్ట్ సాంగ్ అద్భుతంగా ఉంది. అద్భుతమైన డివోషనల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. మంగ్లీ పాతపాడటంతో పాటు నటించారు. ‘ఒకటి, రెండు కాదు మూడు కళ్ళున్నా ఎటు చూస్తాడో అర్థం కాదు’ అనే ఈ సాంగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కంపోజ్ చేశాడు. ఆయనే లిరిక్స్ అందించడం విశేషం. ఇక మంగ్లీ మరోసారి తన స్వరంతో పాటను మధురంగా మార్చింది.
తాజా సాంగ్ వినసొంపుగా ఉంది. గంటల వ్యవధిలో మంగ్లీ శివరాత్రి సాంగ్ ని వేలల్లో చూశారు. యూట్యూబ్ లో సాంగ్ ట్రెండ్ అవుతుంది. నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక అభిమానులు కామెంట్స్ రూపంలో మంగ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక మంగ్లీ నటిగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. స్వేచ్ఛ టైటిల్ తో ఆమె ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేశారు. అలాగే గువ్వా గోరింకా టైటిల్ తో ఒక చిత్రంలో నటించారు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో మూవీలో మంగ్లీ కీలక రోల్ చేశారు. సింగర్ గా మంగ్లీకి భారీ డిమాండ్ ఉంది.
