Mangalavaaram Trailer: దర్శకుడు అజయ్ భూపతి డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 ఓ ప్రభంజనం. 2018లో విడుదలైన ఈ మూవీ యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. నిర్మాతలకు కాసులు కురిపించింది. హీరోయిన్ గా నెగిటివ్ రోల్ చేసిన పాయల్ రాజ్ పుత్ కి ఇమేజ్ దక్కింది. కార్తికేయకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి చాలా గ్యాప్ తీసుకుని సముద్రం మూవీ తెరకెక్కించారు. శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా నటించిన ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈసారి అజయ్ భూపతి సస్పెన్సు హారర్ జోనర్ ఎంచుకున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ మంగళవారం. హిట్ కాంబో రిపీట్ చేస్తూ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓ ఊరిలో జరిగే అంతుపట్టని విషయాల సమాహారం మంగళవారం. మంగళవారం వచ్చిందంటే ఊరిలో హడలు. ఎవరు చావు చూడాల్సి వస్తుందో అని హడలిపోతుంటారు. అదే ఊరిలో పాయల్ రాజ్ పుత్ కుర్రాళ్ళ క్రష్ గా ఉంది.
ట్రైలర్ ఆమె పాత్ర తీరు చూస్తే విచ్చలవిడి శృంగారం చేసే అమ్మాయిగా ఉంది. వరుస మరణాల వెనక ఉంది ఎవరో తెలుసుకునేందుకు పోలీస్ అధికారి నందితా శ్వేతా రంగంలోకి దిగుతుంది. అయితే ఒక్క ఆధారం లభించదు. ఓ మారుమూల గ్రామంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలకు కారణం దెయ్యమా? మనిషా?. ఎవరైనా కానీ ఏమి ఆశించి చేస్తున్నారు? ఈ సంఘటనలతో పాయల్ రాజ్ పుత్ కి సంబంధం ఉందా? అనేది కథ…
ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా మీద ఆసక్తి పెంచేసింది. విజువల్స్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. పాయల్ మరోసారి శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. లెక్కకు మించి బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ చివర్లో నగ్నంగా పొలాల్లో తొట్టెలో పడుకున్న షాట్ కేక. బీజీఎం మరో ఆకర్షణ. అయితే కాంతార, విరూపాక్ష చిత్రాల షేడ్స్ ఉన్నాయి. మంగళవారం ట్రైలర్ చిరంజీవి విడుదల చేశారు. నవంబర్ 17న విడుదల కానుంది.
