Mangalavaaram Movie: అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్ పుత్ కీలకపాత్రలో నటించిన సినిమా మంగళవారం. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. గత నెల 17వ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రేకులకు మంచి కిక్ ని ఇస్తు ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఈ సినిమా సక్సెస్ తో అటు దర్శకుడు అజయ్ భూపతి,ఇటు పయల్ రాజ్ పుత్ ఇద్దరు కూడా కూడా మంచి సక్సెస్ ని నమోదు చేసుకున్నారు.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు లభించింది. నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్ లను అందుకుంటున్నాయి. ఫ్యూచర్ లో కూడా వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందనే టాక్ అయితే వినిపిస్తుంది… ఇక ఇప్పుడు ఇదిలా ఉంటే మంగళవారం సినిమా ఓటిటి లో రిలీజ్ కానుంది అని గత కొద్దిరోజులుగా చాలా రకాల వార్తలైతే బయటకు వస్తున్నాయి.
కానీ అందులోకి ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియడం లేదు. ఇక రీసెంట్ గా మరొక న్యూస్ కూడా వైరల్ అవుతుంది అది ఏంటి అంటే మంగళవారం సినిమా డిసెంబర్ 22వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అన్న విషయం తెగ వైరల్ అవుతుంది.ఇక మరికొందరు మాత్రం డిసెంబర్ 26వ తేదీన మంగళవారం అవుతుంది కాబట్టి మంగళవారం రోజున మంగళవారం సినిమాని ఒటిటి లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యం తో మేకర్స్ మంగళవారం రోజున ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల మీద సినిమా యూనిట్ గాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు గాని ఏ విధంగా స్పందించడం లేదు.
ఇక దీన్ని బట్టి చూస్తే మంగళవారం సినిమా ఎప్పుడు వస్తుందనే విషయం లో ఒక క్లారిటీ అయితే లేదు.ఇక ఈ రెండు మూడు రోజుల్లో సినిమా మేకర్స్ ఈ సినిమా పైన ఒక క్లారిటీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది…మరి థియేటర్ లో సందడి చేసిన ఈ సినిమా ఒటిటి లో ఎంతమేరకు అలరిస్తుందనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా ద్వారా ఆరెక్స్ 100 తర్వాత మరోసారి పాయల్ కి మంచి సక్సెస్ దక్కిందనే చెప్పాలి…