Manchu Vishnu Vs Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకొని ముందుకు సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని సంపాదించి పెట్టాయి. ఎప్పుడైతే బాహుబలి (Bahubali) సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనటువంటి గొప్ప గుర్తింపుని సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఆయన సినిమాలు హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఆయన ఫ్లాప్ సినిమాలకు కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు (Mohan Babu)… తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులందరిని కట్టిపడేసాడు. ఒకప్పుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.
ఇక ఆయన నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు మంచు మనోజ్ లాంటి హీరోలు సైతం విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మంచు మనోజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు (Vishnu) మాత్రం హీరోగా రాణించాలనే తీవ్ర ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఇక దానికోసమే పాన్ ఇండియా లో ‘కన్నప్ప’ (Kannappa) సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Also Read: Manchu Vishnu : భైరవం పై మంచు విష్ణు కుట్ర చేశాడా? తెరపైకి కొత్త వాదన!
ఈ సినిమాలో మంచు విష్ణు తనదైన రీతిలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో చాలామంది పాన్ ఇండియా నటులు నటిస్తున్నారు. ప్రభాస్ లాంటి నటుడు సైతం ఈ సినిమాలో నంది పాత్రలో నటిస్తున్నాడు.
ఆయన పాత్ర పేరు రుద్ర కావడం విశేషం… అయితే కన్నప్ప ను మార్చడానికి రుద్ర కిందికి వస్తాడు. ఈ క్రమంలోనే కన్నప్ప పత్ర చేస్తున్న మంచు విష్ణు కి ఈ మధ్య ఒక తీవ్రమైన ఫైట్ అయితే జరుగుతుందట. ఈ ఫైట్ లో మంచు విష్ణు, ప్రభాస్ ని కొడతారట. ఇక ఈ విషయాన్ని టీజర్ లో కూడా ఎలివేట్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా మంచు విష్ణు ప్రభాస్ ని కొట్టడం అతని అభిమానులు జీర్ణించుకుంటారా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…