Manchu Vishnu : భైరవం మూవీని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏలూరులో భైరవం ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల వేదిక మీద పొలిటికల్ కామెంట్స్ చేశాడు. విజయ్ కనకమేడల కామెంట్స్ తో ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు #BoycottBHAIRAVAM ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఆ మూవీని బహిష్కరించడం ద్వారా డిజాస్టర్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
వారికి మెగా ఫ్యాన్స్ తోడయ్యారు. దీనికి కూడా విజయ్ కనకమేడల కారణం అయ్యాడు. విజయ్ కనకమేడల 2011లో ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. చిరంజీవి, రామ్ చరణ్ లను కించపరిచే విధంగా ఉన్న మార్ఫ్డ్ పోస్టర్ ఆయన ఫేస్ బుక్ ఖాతాలో దర్శనం ఇచ్చింది. ఈ పోస్ట్ పై విజయ్ కనకమేడల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ పోస్ట్ తాను పెట్టలేదని, తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని అన్నారు. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ కి క్షమాపణలు అంటూ ఓ సందేశం విడుదల చేశాడు. విజయ్ కనకమేడల వివరణతో మెగా ఫ్యాన్స్ శాంతించిన సూచనలు కనిపించడం లేదు. వారు ఆగ్రహంగానే ఉన్నారు.
అయితే విజయ్ కనకమేడల ఓల్డ్ పోస్ట్ వెలుగులోకి తెచ్చింది మంచు విష్ణునే అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. మంచు విష్ణు టీమ్ విజయ్ కనకమేడల ఒకప్పటి సోషల్ మీడియా పోస్ట్ బహిర్గతం చేశారు. భైరవం మూవీ మీద మంచు విష్ణు కుట్ర చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచు బ్రదర్స్ విష్ణు-మనోజ్ మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. బహిర్గతంగానే ఒకరినొకరు తిట్టుకుని, కొట్టుకునే స్థాయికి వారి గొడవలు వెళ్లాయి.
భైరవం ట్రైలర్ రిలీజ్ వేడుకలో కన్నప్ప మూవీపై మంచు మనోజ్ సెటైర్స్ వేశాడు. శివయ్యా.. అని పిలిస్తే శివయ్య రాడు, అని మంచు విష్ణుకి చురకలు వేశాడు. మంచు మనోజ్ చర్యలతో ఆగ్రహానికి గురైన మంచు విష్ణు.. విజయ్ కనకమేడల ఒకప్పటి సోషల్ మీడియా పోస్ట్ బయటపెట్టి, భైరవం మూవీ మీద వ్యతిరేకత వచ్చేలా చేశాడు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ ఊహాగానాల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.
#ManchuVishnu behind #BoycottBHAIRAVAM trend. His team released the screenshots of directors old Facebook posts. Family dispute taking murky turns.@ManojManchuFans
— Joseph Batchalakuri (@23102024S) May 24, 2025