Manchu Vishnu on Kannaappa movie : మంచు విష్ణు(Manchu Vishnu) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie) ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలకు సిద్ధం గా ఉన్నది. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తం ప్రొమొతిఒన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది. ముఖ్యంగా మంచు విష్ణు అయితే నాన్ స్టాప్ గా ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన అనేక విషయాలకు చాలా కూల్ గా సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చయానికి గురి చేసింది. యాంకర్ విష్ణు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘కన్నప్ప చిత్రాన్ని వేరే హీరో చేసి ఉండుంటే ఈ పాటికి క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది అని అంటాను. దానికి మీరు ఏమి అంటారు?’ అని అడుగుతారు. ఇంత పెద్ద మాట అన్న తర్వాత మంచు విష్ణు కి వాస్తవంగా కోపం రావాలి, కానీ ఆయన సమాధానం ఇచ్చిన తీరు నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆయన మాట్లాడుతూ ‘అవును..మీరు చెప్పింది నిజం కావొచ్చు. ఎందుకంటే నా గత ట్రాక్ రికార్డు ని చూసి నా నుండి ఒక మంచి సినిమా వస్తుంది అంటే ఎవరు నమ్ముతారు. నా చివరి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి సహజమే కదా ఇలాంటివి జరగడం’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు యాంకర్ సమాధానం ఇస్తూ ‘వాస్తవానికి ఈ చిత్రం లో పాటలు చాలా బాగున్నాయి. ఉదాహరణకు రామజోగ్గయ్య శాస్త్రి గారు రాసిన పాట అద్భుతం. దానికి రావాల్సినంత రీచ్ కేవలం మీ సినిమా కారణంగా రాలేదేమో..ఎందుకో ఆడియన్స్ కి మీరంటే చిన్న చూపు అనిపిస్తుంది సార్’ అని అంటాడు. దానికి విష్ణు సమాధానం ఇస్తూ ‘ఏమో..బహుశా నిదానంగా ఆ పాటలు జనాలకు రీచ్ అవ్వొచ్చు’.
‘సినిమా విడుదల అయ్యాక కూడా మంచి రీచ్ అవ్వొచ్చు. ఈ పాట రీచ్ అవ్వలేదు అనేది మీ అభిప్రాయం అయ్యి ఉండొచ్చు. కానీ అద్భుతమైన రీచ్ వచ్చింది. యాపిల్ యాప్ లో ఇప్పటికీ టాప్ 7 లో కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలోని పాటల ఆడియో రైట్స్ ఎవరికీ అమ్మలేదని విన్నాము, నిజమేనా అని అడగ్గా, దానికి విష్ణు సమాధానం చెప్తూ ‘సాధారణంగా నా సినిమా ఆడియో రైట్స్ ని నేను ఎవరికీ అమ్మను. కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే ఇస్తాను. నేను చివరిసారిగా ఆడియో రైట్స్ అమ్మిన చిత్రం ‘దేనికైనా రెడీ’. అందులో పిల్ల అందం కేక అనే పాట కోట్ల రూపాయిలను తెచ్చి పెట్టింది. అప్పుడే నేను పాటల విలువ తెలుసుకున్నాను. అప్పటి నుండి నా సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ని నేను ఎవరికీ అమ్మడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.