Manchu Vishnu: కన్నమ్మ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు మంచు విష్ణు. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. సినిమా షూటింగ్ ప్రధాన భాగం న్యూజిలాండ్ దేశంలో జరిగింది. అక్కడి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. కన్నప్ప మూవీలో మంచు విష్ణు శివ భక్తుడిగా కనిపించనున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు నిర్మిస్తూ.. ఓ కీలక రోల్ చేశారు. ప్రభాస్ రుద్ర అనే గెస్ట్ రోల్ చేశాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ క్యాస్ట్ కన్నప్ప మూవీలో భాగం కాగా అంచనాలు పెరిగాయి.
Also Read: కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొననున్న ప్రభాస్…మంచు విష్ణు మామూలుగా ప్లాన్ చేయడం లేదుగా…
కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో మంచు విష్ణు పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఆయన కన్నప్ప స్వగ్రామాన్ని సందర్శించాడు. అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, ఊటుకూరు కి ఆయన వెళ్లారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాన్ని సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తానని మంచు విష్ణు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాడు.
మరోవైపు మంచు విష్ణు విజయం అందుకుని చాలా కాలం అవుతుంది. ఆయన చిత్రాలకు కనీస ఆదరణ దక్కడం లేదు. ఈ క్రమంలో కన్నప్ప మూవీ సక్సెస్ పై అనుమానాలు లేకపోలేదు. అందులోనూ ఇది భారీ బడ్జెట్ మూవీ. మంచు విష్ణుకు ఉన్న మార్కెట్ రీత్యా రిస్క్ తో కూడిన వ్యవహారం. మంచు విష్ణు నటించిన గత చిత్రం జిన్నా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు మాత్రం రాలేదు. కోటి రూపాయల గ్రాస్ రావడమే గగనమైంది. మరి కన్నప్ప వందల కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
ప్రభాస్ మీద మంచు విష్ణు ఆశలు పెట్టుకున్నాడు. ఆయన గెస్ట్ రోల్ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్టార్డం కన్నప్ప సినిమాకు ఆడియన్స్ ని తీసుకొస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఇక మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ వలన ఇతర భాషల్లో కన్నప్ప మూవీకి ప్రచారం దక్కుతుంది. వసూళ్లు రాబడుతుంది అనే నమ్మకం ఉంది.