Ginna Movie Collections: హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా..ప్రేక్షకులు ఆదరించకపోయిన సినిమా మీద ఇష్టం తో పని చేస్తున్న కుటుంబం మంచు కుటుంబం..వాస్తవానికి ఈ కుటుంబ సభ్యులు చేస్తున్న సినిమాలను థియేటర్ కి వెళ్లి చూడడం జనాలు ఎప్పుడో మానేశారు..కానీ ఇండస్ట్రీ లో మేము మెగా మరియు నందమూరి కుటుంబాలతో పోటీపడే రేంజ్ హీరోలం అనే అపోహలో ఉంటారు మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబు.

మంచు మోహన్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది మన అందరికి తెలిసిందే..కనీసం పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా ఈ సినిమాకి రాలేదు..ఇక మంచు విష్ణు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం జిన్నా సినిమాకి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..కానీ కలెక్షన్స్ మాత్రం నిల్..దీపావళి పండుగ సేవలను క్యాష్ చేసుకుందామని వచ్చిన మంచు విష్ణు కి గట్టి ఎదురు దెబ్బె తగిలింది.
పాయల్ రాజ్ పుత్ మరియు సన్నీ లియోన్ వంటి టాప్ హీరోయిన్లు ఈ సినిమాలో ఉండడం తో కనీసం వాళ్ళకోసమైన యూత్ ఈ సినిమాకి వస్తారనే అంచనా తో ప్రీ రిలీజ్ బిజినెస్ మంచు విష్ణు రేంజ్ కి మించి 4 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..కానీ మొదటి రోజు ఈ సినిమాకి కేవలం 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రెండవ రోజు నుండి అయినా ఈ సినిమాకి కలెక్షన్స్ లో జంప్ ఉంటుందని అంచనా వేశారు..కానీ ఆ అంచనాలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి.

రెండవ రోజు ఈ సినిమాకి కేవలం 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లు రావడం తో..క్లోసింగ్ కలెక్షన్స్ కనీసం 50 లక్షల రూపాయిలు కూడా వచ్చేలా కనిపించడం లేదు..మొత్తం మీద సాలిడ్ గా నాలుగు కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతున్న కూడా తండ్రికొడుకులిద్దరు సినిమాలు చేసుకుంటూ దండయాత్ర చేస్తున్నారంటే వాళ్లకి సినిమా మీద ఎంత పాషన్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.