Allu Sirish- Pawan Kalyan And Balakrishna: అల్లు శిరీష్ – అను ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లు గా నటించిన ‘ఊర్వశివో రాక్షసీవో’ అనే సినిమా వచ్చే నెల 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న నేపథ్యం లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరపనున్నారు అల్లు అరవింద్..మెగా ఫామిలీ లో ఇప్పటి వరుకు వచ్చిన హీరోలందరూ కూడా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని సంపాదించుకొని స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్న వాళ్ళే..కానీ అల్లు శిరీష్ మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు..కెరీర్ లో ఒకటి రెండు హిట్స్ పడినప్పటికీ కూడా అది ఆయనకీ ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చెయ్యడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు.

ఇక ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మంచి సాలిడ్ కథ తో ‘ఉర్వశివో రాక్షసీవో’ అనే సినిమాతో మన ముందుకి వస్తున్నాడు..ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ చిత్రం ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ని పూర్తి చేసుకోవడానికి బాగా ఆలస్యం అయ్యింది.
బన్ను వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గీత ఆర్ట్స్ ద్వారా అల్లు అరవింద్ సమర్పణ లో విడుదల కానుంది..చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ కి మంచి ప్రాజెక్ట్ పడింది అని అల్లు అరవింద్ గట్టిగా నమ్మడం తో ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యే ప్లాన్ వేసాడు..త్వరలో జరగబొయ్యే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మరియు నందమూరి బాలకృష్ణ ని ముఖ్య అతిధులుగా ఆహ్వానించాడట..పవన్ కళ్యాణ్ మరియు బాలయ్య బాబు ఇప్పటి వరుకు బహిరంగంగా ఒకే స్టేజి మీద ఎప్పుడు కనిపించలేదు..ఇదే తొలిసారి.

ఇద్దరు ఎప్పుడు కలవని సూపర్ స్టార్స్ ని ఒకే చోట కలిపే ప్రయత్నం చేస్తే అది పెద్ద హాట్ టాపిక్ అవుతుంది..అందుకే అల్లు అరవింద్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..వీళ్లిద్దరు ఒకే చోట కలిస్తే వచ్చే సెన్సేషన్ అల్లు శిరీష్ సినిమాకి బాగా సహాయపడుతుందని అల్లు అరవింద్ గారి ఉద్దేశ్యం అట.