Homeఎంటర్టైన్మెంట్Manchu Vishnu: మంచు మనోజ్ టార్గెట్ గా విష్ణు కామెంట్స్, పతనం కోరుకుంటున్నారు అంటూ సంచలనం!

Manchu Vishnu: మంచు మనోజ్ టార్గెట్ గా విష్ణు కామెంట్స్, పతనం కోరుకుంటున్నారు అంటూ సంచలనం!

Manchu Vishnu: విలక్షణ నటుడు మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా చలామణి అయ్యారు. నటుడిగా, నిర్మాతగా ఆయనది సుదీర్ఘ ప్రస్థానం. అయితే కుటుంబంలో నెలకొన్న కలహాలు రచ్చ కెక్కడంతో ఆయన కీర్తి మసకబారుతుంది. ఈ వివాదాల్లో ఆయన కూడా ప్రత్యక్షం పాల్గొన్నారు. చిన్న కుమారుడు మనోజ్ తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు మీద న్యాయపోరాటం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా నాలుగు గోడల మధ్య సాగుతున్న కలహాలు రచ్చకెక్కాయి. పరస్పర దాడులు చేసుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. పోలీస్ అధికారులు ఇరు వర్గాలను పిలిచి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.

Also Read: నయనతార మారిపోయింది, చిరంజీవి కోసమేనా?

మోహన్ బాబు జుల్పల్లి నివాసం నుండి మనోజ్ ని బయటకు పంపేశాడు. మోహన్ బాబు, విష్ణులపై మనోజ్ ఆరోపణలు చేశాడు. మోహన్ బాబు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ ఆరోపించాడు. ఇక సోషల్ మీడియాలో విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు దారుణమైన కామెంట్స్ చేసుకున్నారు. మంచు ఫ్యామిలీలో నెలకొన్న ఈ సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా మాటల దాడి కొనసాగుతుంది.

విష్ణు నటించిన కన్నప్ప విడుదలకు సిద్ధం అవుతుంది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. నిర్దిష్టమైన తేదీ ప్రకటించాల్సి ఉంది. విష్ణు మాత్రం నిరవధికంగా కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రభాస్ ప్రస్తావన రాగా… తన మంచి కోరి ప్రభాస్ కన్నప్ప లో గెస్ట్ రోల్ చేశారు. రక్తం పంచుకుని పుట్టినవారు మాత్రం నా పతనం కోరుకుంటున్నారు, అన్నారు. విష్ణు చేసిన ఈ కామెంట్ మనోజ్ ని ఉద్దేశించే అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.

ఆస్తుల పంపకమే ఈ వివాదాలకు కారణం అనే వాదన ఉంది. విష్ణుకు తన ఆస్తిలో అధికభాగం మోహన్ బాబు కట్టబెట్టారని, మనోజ్, మంచు లక్ష్మికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు మోహన్ బాబు, విష్ణు మరొకవైపు చేరి వాదులాడుకుంటున్నారు. మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది.

Exit mobile version