Manchu Vishnu Comments On Puri Jagannadh: మంచు కుటుంబం లో మంచు విష్ణు(Manchu Vishnu) ని కానీ, మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ని కానీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆ రేంజ్ లో ట్రోల్ చేయడానికి కారణం వాళ్ళు ఇచ్చే ప్రసంగాలు. తాము పైన నుండి దిగి వచ్చిన దేవుళ్ళు లాగా మాట్లాడుతూ ఉంటారు, చాలా వరకు అతిశయోక్తి గానే అందరికీ అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మంచు విష్ణు అప్పుడప్పుడు నోరు జారుతుండడం కూడా ఆయన పై తీవ్రమైన నెగటివిటీ పెరగడానికి కారణం. మరో రెండు రోజుల్లో ఆయన హీరో గా నటించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ ప్రొమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ మంచు విష్ణు పై ఈ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
టాలీవుడ్ మాస్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ ‘పూరి జగన్నాథ్ గారు ఒకప్పుడు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. కానీ ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది’ అంటూ కామెంట్స్. దీనికి నెటిజెన్స్ పూరి జగన్నాథ్ గురించి ఒకప్పుడు మాట్లాడుకోవడానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. కానీ నీ గురించి మాట్లాడుకోవడానికి అప్పట్లో ఏమి లేదు, ఇప్పుడు కూడా ఏమి లేదు కదా విష్ణు. అసలు ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత నీకు ఉందా?, అసలు ఏమి మాట్లాడుతున్నావా నీకైనా అర్థం అవుతుందా ? అంటూ మంచు విష్ణు ని ట్యాగ్ చేసి తిడుతున్నారు నెటిజెన్స్. మాస్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకే మూసలో వెళ్తున్న తెలుగు సినిమాని సరికొత్త హీరోయిజం దారిలో నడిపించిన దర్శకుడు ఆయన.
Also Read: Puri Jagannadh and Ramaprabha : పూరి జగన్నాధ్ సీనియర్ నటి రమాప్రభ కి హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే..?
ప్రతీ డైరెక్టర్ కి అద్భుతమైన ఫేస్ ఉంటుంది, అదే విధంగా అత్యంత నీచమైన ఫేస్ కూడా ఉంటుంది. అసలు అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్ గా దేశం మొత్తం గర్వించ దగ్గ డైరెక్టర్ గా పేరొందిన శంకర్ లాంటి లెజెండ్ నే ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ ని ఎదురుకుంటున్నాడు. ఒకప్పుడు శంకర్ తో పని చేయడం అదృష్టం అని భావించిన వాళ్ళే నేడు ఆయన్ని చూసి పారిపోతున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ పూరి జగన్నాథ్ లో టాలెంట్ ఉంది, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా అతను బౌన్స్ బ్యాక్ అవ్వగలడు. మరి నీలో ఏముంది విష్ణు?, నీ పేరు మీద టికెట్స్ కొనేవాళ్ళు లేరని , దేశం లో ఉన్న ప్రముఖులందరినీ పెట్టి ‘కన్నప్ప’ చిత్రాన్ని తీసావు. అయినప్పటికీ నీ సినిమాని కొనేందుకు ఒక్కడు కూడా ముందుకు రాలేదు. నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నావా అంటూ మంచు విష్ణు ని బండబూతులు తిడుతున్నారు నెటిజెన్స్.