YS Jagan
YS Jagan: విజయవాడ జైల్లో వైసిపి నేత వల్లభనేని వంశీ జ్యూడిషల్ ఖైదీగా ఉన్నారు. ఏపీలోని టిడిపి కార్యాలయంలో గతంలో దాడి జరిగింది. ఆ దాడి వెనుక వైసిపి నేతలు ఉన్నారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి కేసును తిరగతోడింది. టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్య వర్ధన్ ఫిర్యాదు చేయడంతో వల్లభనేని వంశీ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సత్య వర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఏమీ చేయలేకపోయారు. సత్య వర్ధన్ ను వల్లభనేని వంశీ మనషులు అపహరించడంతోనే కేసు వెనక్కి తీసుకున్నారని.. ఏపీ పోలీసులు సరికొత్త ఫిర్యాదుతో వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వల్లభనేని వంశీని గురువారం హైదరాబాదులోని రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను విజయవాడ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనే విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత వల్లభనేని వంశీని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని ఆయనకు అభయమిచ్చారు. అనంతరం సబ్ జైలు ఎదుట విలేకరులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.. వల్లభనేని వంశీ చంద్రబాబు కంటే అందంగా ఉంటాడు కాబట్టే అరెస్టు చేశారని ఆరోపించారు. నారా లోకేష్ కంటే రాజకీయాలలో ఎక్కువగా ఎదుగుతున్నారు కాబట్టే అణగ తొక్కుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రజలకు సేవ చేయాలని.. తమ నెత్తి మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయాలని.. టిడిపి నేతలకు కాదని ఆయన సూచించారు. తాము అధికారంలోకి వస్తే అలాంటి పని చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.
చిన్నారితో సెల్ఫీ
విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వచ్చిన తర్వాత.. సభ్యులు పరిసర ప్రాంతంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీగా కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఓ చిన్నారి వచ్చింది. చాలాసేపటి నుంచి జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగడానికి ఆ చిన్నారి ఏడుస్తోంది.. ఆ చిన్నారి అలా అడగడాన్ని జగన్మోహన్ రెడ్డి గమనించారు.. ఆ చిన్నారిని తన వద్దకు పంపించాలని సెక్యూరిటీకి ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా రమ్మని పిలవడంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ చిన్నారిని తన వద్దకు తీసుకొని.. జగన్మోహన్ రెడ్డి నుదుటిమీద ముద్దు పెట్టారు. దీంతో ఆ చిన్నారి భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి సెల్ఫీ తీసుకుంది.. ఈ వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నాయి.. ఇదీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మంచి మనసు అంటూ వైసీపీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి. ” అంతటి రద్దీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెను గుర్తించారు. తన వద్దకు రమ్మని పిలిచారు. సెక్యూరిటీకి అదే తీరుగా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత దగ్గరికి తీసుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు.. ఆ చిన్నారి జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి భావోద్వేగానికి గురైంది. వెంటనే సెల్ఫీ కూడా తీసుకుంది. ఇది జగన్మోహన్ రెడ్డి మంచి మనసుకు నిదర్శనమని” వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నాయి.
విజయవాడ జైలు లో ఉన్న వల్లభనేని వంశీని వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి తిరిగి వస్తుండగా ఓ చిన్నారి రావడాన్ని గమనించారు. జగన్ పిలిచి ఆ చిన్నారికి ముద్దు పెట్టారు. ఆ తర్వాత ఆ చిన్నారి భావోద్వేగానికి గురై సెల్ఫీ దిగింది.#YSJaganMohanReddy #Vijayawada #vallabhaneniVamshi pic.twitter.com/Nhoj8vUvfG
— Anabothula Bhaskar (@AnabothulaB) February 18, 2025