Manchu Manoj satire on Mohan Babu: గత ఏడాది మంచు కుటుంబం లో చోటు చేసుకున్న గొడవలు నెటిజెన్స్ కి ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ని అందించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ని చూస్తున్నట్టే అందరికీ అనిపించింది. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు , అన్నయ్య మంచు విష్ణు లపై ఆస్తి విషయం లో తిరుగుబాటు చేయడం , వాళ్ళు కూడా ఏ మాత్రం తగ్గకుండా , మనోజ్ ని తమ ఇంటి నుండి గెంటేయడం, ఆ తర్వాత ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం , మనోజ్ ఇంటి ముందు బైఠాయించి ధర్నాలు చేయడం , ఇలా ఒక్కటా రెండా , ఎన్నో సంఘటనలు జరిగాయి . క్రమశిక్షణ కి మారుపేరు లాంటి మోహన్ బాబు ఇంట్లో గొడవలు , ఇలా రోడ్డు మీదకు వచ్చేసాయి ఏంటో అంటూ అభిమానులు బాధపడ్డారు.
అయితే ఈ విషయం పై గత ఏడాది నుండి ఎలాంటి చప్పుడు లేదు , గొడవలు సర్దుకున్నాయేమో అని అంతా అనుకున్నారు. అయితే రేపు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన హీరో గా నటించిన ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మనోజ్ ని ఒక రిపోర్టర్ ‘మీ ఇంట్లోని సమస్యలు సర్దుకున్నాయా సార్’ అని అడగ్గా, మనోజ్ సమాధానం చెప్తూ ‘అది మీరు నన్ను అడగకూడదు , ఎవరిని అడగాలో తెలుసు కదా, అయితే వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి జాగ్రత్త (నవ్వుతూ) ‘అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మనోజ్ అలా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి అనగానే మీ అందరికీ ఒక సంఘటన గుర్తుకు వచ్చే ఉంటుంది. ఈ గొడవ జరుగుతున్నా సమయం లో ఒక మీడియా రిపోర్టర్ మోహన్ బాబు వద్దకు వెళ్లగా, అతనిపై మైక్ తో దాడి చేస్తాడు.
పాపం ఆ రిపోర్టర్ కి తీవ్రమైన గాయాలై హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన ని ఉద్దేశించే మనోజ్ నేడు సెటైర్లు వేశాడు . దీనిని బట్టీ చూస్తుంటే మనోజ్ ని మోహన్ బాబు ఈ జన్మలో దగ్గరకు తీసేలా లేడని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే సినిమాలకు చాలా రోజులు గ్యాప్ ఇచ్చి ‘భైరవం’ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ , ఆ తర్వాత ‘మిరాయ్’ చిత్రం తో ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరో గా రీ ఎంట్రీ ఇస్తూ ‘డేవిడ్ రెడ్డి’ చేస్తున్నాడు. ఈ చిత్రం కమర్షియల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
Media: “మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా?”
Manchu Manoj: “అది ఎవరిని అడగాలో మీకే తెలుసు… వెళ్లి అడగండి. కానీ mic పట్టుకుని కాదు… helmet పెట్టుకుని వెళ్లండి!” pic.twitter.com/FeVRfLpMgZ
— M9 NEWS (@M9News_) May 19, 2026
