Manchu Manoj : దాదాపుగా 9 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మంచు మనోజ్(Manchu Manoj) నటించిన చిత్రం ‘భైరవం'(Bhairavam Movie). ఈ నెల 30 వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇందులో మనోజ్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas), నారా రోహిత్(Nara Rohit) లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ మాట్లాడిన మాటలు ఈ సినిమా పై సోషల్ మీడియా లో నెగటివిటీ ని పెంచాయి. ‘బాయ్ కాట్ భైరవం’ అంటూ ఒక పక్క వైసీపీ ఫ్యాన్స్, మరో పక్క మెగా ఫ్యాన్స్ డైరెక్టర్ పై విరుచుకుపడ్డారు.
Also Read : మంచు లక్ష్మి తనకు అక్క కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్!
డైరెక్టర్ మీద ఎందుకు మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారంటే, గతంలో ఆయన ఫేస్ బుక్ అకౌంట్ లో చిరంజీవి(Megastar Chiranjeevi), రామ్ చరణ్(Global Star Ram Charan) లకు సంబంధించిన ఒక మార్ఫింగ్ ఫోటోని అప్లోడ్ చేయడం వల్లే. ఇది మెగా ఫ్యాన్స్ తవ్వి బయటకి తీసి వైరల్ చేయడం తో డైరెక్టర్ ని ఏకిపారేశారు నెటిజెన్స్. ఆ తర్వాత ఆయన దానికి క్షమాపణలు చెప్పడం, వెంటనే మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్నీ వదిలేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కామెంట్స్ పై మనోజ్ మాట్లాడుతూ ‘విజయ్ అన్న మెగా ఫ్యామిలీ గురించి నెగటివ్ గా మాట్లాడే టైపు కాదు. నాకు ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారికి ఎంత పెద్ద వీరాభిమానో తెలుసు. ఆయన వ్వాట్సాప్ డీపీ కూడా పవన్ కళ్యాణ్ గారిదే ఉంటుంది’.
‘నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంతో అభిమానించే వాడిని. ఈ కార్యక్రమం లో విజయ్ రాజకీయాలను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమాని గా మాత్రమే మాట్లాడాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన కులాల గురించి మాట్లాడుతూ ‘మనం 2025 వ సంవత్సరం లో ఉన్నాం, ఇంకా మనం కులాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం చదువుకున్న చదువుకి ఏమి విలువ ఇస్తున్నట్టు. నేను చార్మినార్ ని ఇష్టపడుతున్నాను కాబట్టి తాజ్ మహల్ ని ఇష్టపడడం లేదని కాదు. ఆ రెండిటిని ఇష్టపడితే ఒకే కులానికి చెందిన వాళ్ళ కట్టడాలను ఇష్టపడుతున్నావ్ అని ముద్ర వేస్తారేమో. ఒక విషయం అడుగుతాను, ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వీళ్లంతా ఏ కులమని ఆరాధిస్తున్నాము మనం?, మనది కేవలం ప్రేమికులం మాత్రమే, నా కులం అదే, సినిమాలకు కులాలకు లింక్ పెట్టకండి’ అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.