Manchu Manoj NTR: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఫ్యామిలీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో మంచు మనోజ్(Manchu Manoj). ఇతని మాట తీరు,చేసే విభిన్నమైన సినిమాలు ఆడియన్స్ కి బాగా నచ్చుతూ ఉంటుంది. మంచు కుటుంబం లో ఇతర హీరోలపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా, మనోజ్ పై మాత్రం ట్రోల్స్ రావు. రీసెంట్ గానే ఆయన చాలా కాలం గ్యాప్ తర్వాత ‘భైరవం’ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందుకు కారణం ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ కి రీమేక్ అవ్వడమే. ఈ కాలంలో రీమేక్ సినిమాలను మన ఆడియన్స్ ఒక రేంజ్ లో రిజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేసి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ‘భైరవం’ ప్రొమోషన్స్ లో భాగంగా మనోజ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ తో తన స్నేహం గురించి, అతనితో జరిగిన కొన్ని ఫన్నీ సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు.
Also Read: ప్రభాస్ ని నేను బావ అని పిలుస్తుంటాను..అతను లేకుంటే కన్నప్ప లేదు – మోహన్ బాబు
ఆయన మాట్లాడుతూ ‘ చిన్నప్పుడు నేను, ఎన్టీఆర్(Junior NTR) కలిసి ఒక సైంటిఫిక్ ప్రయోగం చేసాము. మేము ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక ఫంక్షన్ ఈ ప్రయోగానికి వేదిక అయ్యింది. ఎన్టీఆర్ బెలూన్ ని పట్టుకొని మంటతో వెలిగిస్తున్నాడు. నేను ఆ బెలూన్ ని పగలగొట్టడం తో నిప్పు ఎన్టీఆర్ చేతికి అంటుకుంది. దాంతో ఎన్టీఆర్ గట్టిగా ఏడ్చేశాడు.అది మా అమ్మమ్మ ఆదిలక్షమ్మ చూసి సులగలు తీసుకొని నన్ను చితకబాదేసింది. బిడ్డని చంపేస్తావా ఏంటి అంటూ నన్ను తరిమి తరిమి కొట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. ఎన్టీఆర్ కూడా గతంలో మంచు లక్ష్మి షో లో మనోజ్ తో స్నేహం గురించి చెప్తూ ‘కిక్ చిత్రం లో వీడు (మనోజ్) రవితేజ లాంటోడు, నేను వేణు మాధవ్ లాంటి వాడిని’ అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇక మనోజ్ సినిమాల విషయానికి వస్తే తేజ రోజా హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘మిరాయ్’ లో మనోజ్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా ఆయన హీరో గా ‘అత్తరు సాయిబు’ అనే చిత్రం చేస్తున్నాడు. కామెడీ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో స్పెషల్ గా ఉండబోతుందని మనోజ్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఒకపక్క పవర్ ఫుల్ క్యారక్టర్ రోల్స్ చేస్తూనే, మరోపక్క హీరో గా కూడా కొనసాగుతూ మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని నడిపే ప్రయత్నం చేస్తున్నాడు.