Kannappa Controversy: ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం విడుదలకు ముందే ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మాయం అయ్యిందని, అందులో సినిమాకు సంబంధించిన ఒక గంట 30 నిమిషాల గ్రాఫిక్స్ కంటెంట్ ఉందని, మంచు మనోజ్(Manchu Manoj) తన మనుషులతో ఈ పని చేయించాడు అంటూ మంచు విష్ణు(Manchu Vishnu) ఆరోపణలు చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ హార్డ్ డ్రైవ్ తన చేతుల్లోకి రాలేదని,అందులో ఉన్న కంటెంట్ ని లీక్ చేయకుండా ఉంటే ఎలాంటి సమస్య లేదని, లీక్ చేస్తే మాత్రం మేము చాలా నష్టపోతామని, దానికి పాస్ వర్డ్ ఉంది కానీ , అది నూటికి నూరు శాతం సేఫ్ కాదని చెప్పుకొచ్చాడు. ఈ వివాదం ఒక పక్క నడుస్తూ ఉండగా, మరో పక్క బ్రాహ్మణ సమాజం ఈ చిత్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.
ఈ చిత్రం లో ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం, సప్తగిరి కలిసి పిలకా, గిలకా అనే పాత్రలు చేశారు. దీనిపై బ్రాహ్మణ చైతన్య వేదిక స్పందిస్తూ ఆ పాత్రల పేర్లు తమ కమ్యూనిటీ ని అవమాన పరిచేలా ఉందని, తక్షణమే ఆ పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ముందుగా సెన్సార్ బోర్డుకి లేఖ రాయగా, మేము ఇంకా ఈ చిత్రాన్ని సెన్సార్ చేయలేదు అంటూ సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. బ్రాహ్మణుల విషయం లో గతంలో కూడా మంచు కుటుంబం ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. మంచు విష్ణు హీరో గా నటించిన ‘దేనికైనా రెడీ’ చిత్రంలో కూడా అప్పట్లో బ్రాహ్మణులను అవమానించారంటూ పెద్ద ఎత్తున గొడవలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాని బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్ కూడా చేసారు. మళ్ళీ ఇప్పుడు అదే బ్రాహ్మణ సమాజం మంచు విష్ణు సినిమాలోని పాత్రలపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.
ప్రతీసారి బ్రాహ్మణ సమాజమే విష్ణు సినిమాలను టార్గెట్ చేస్తుందంటే విష్ణు కావాలని వాళ్ళ మనోభావాలను రెచ్చగొడుతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా లో ఉన్నటువంటి నెటిజెన్స్. మరి దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు సమందించిన మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరు లో నిర్వహించారు. మూవీ లో పని చేసిన ప్రతీ ఒక్కరు ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. మంచు విష్ణు ఈ సినిమాని సుమారుగా 250 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. రెబెల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి బడా సూపర్ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. చూడాలి మరి ఈ చిత్రం ఫుల్ రన్ లో ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది.