Manchu Manoj: చాలా కాలం విరామం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit), మంచు మనోజ్(Manchu Manoj) కలిసి ‘భైరవం'(Bhairavam Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు హీరోలు ఈమధ్య కాలంలో సోలో గా సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. అసలు ఏమయ్యారు వీళ్ళు అని చాలా మంది మాట్లాడుకున్నారు. మంచు మనోజ్ ఎలాగో వివాదాల కారణంగా మీడియా లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఏమయ్యారో ఆడియన్స్ కి అర్థం అయ్యేది కాదు. అకస్మాత్తుగా ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో మన ముందుకు రావడం అందరినీ సర్ప్రైజ్ కి గురి చేసింది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ అనే చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ముందుగా ఈ సినిమాని రవితేజ, విశ్వక్ సేన్, మంచు మనోజ్ కాంబినేషన్ లో చేద్దాం అనుకున్నారు.
Also Read: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ ఆ హిట్ సినిమా కి రీమేక్ గా రాబోతోందా..?
కానీ ఎందుకో కుదర్లేదు. చివరికి ఈ ముగ్గురితో కానిచ్చేశారు. వాస్తవానికి ఈ సినిమాని కన్నప్ప చిత్రానికి పోటీగా ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉండడం తో ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27 కి వాయిదా పడింది. దీంతో ‘భైరవం’ చిత్రాన్ని కూడా వాయిదా వేశారు. దీనిని కూడా జూన్ 27న విడుదల చేస్తారని ఆడియన్స్ అనుకున్నారు కానీ, అంత దూరం ఎదురు చూడలేక మే 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా లో నెటిజెన్స్ అన్నయ్య విష్ణు కోసం తమ్ముడు మనోజ్ అడ్డు తప్పుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ డేట్ లో ‘హరి హర వీరమల్లు’ లేదా ‘కింగ్డమ్’ చిత్రాలలో ఎదో ఒకటి విడుదల అవ్వాల్సి ఉంది. కానీ పరిస్థితి చూస్తుంటే ఈ రెండు సినిమాలు కూడా ఆ డేట్ లో వచ్చేలా కనిపించడం లేదు. మంచి డేట్ అవ్వడం తో భైరవం చిత్రాన్ని ఆ డేట్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటించింది. ఇక మంచు మనోజ్ ఇందులో నెగటివ్ క్యారక్టర్ చేసాడు. ఒరిజినల్ వెర్షన్ ని చూసి, రీసెంట్ గా విడుదలైన టీజర్ ని చూసిన వాళ్లకు ఈ విషయం చాలా తేలికగా అర్థం అవుతుంది. మంచి సబ్జెక్టు తో తెరకెక్కిన సినిమా, ఈ ముగ్గురు హీరోలకు భారీ కం బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ చిత్రం విడుదల తర్వాత ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది. ఈ ఏడాది మీడియం రేంజ్ సినిమాల హవానే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమా కూడా సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.