Manchu Manoj : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. మోహన్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తన కొడుకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే తన ఇద్దరు కొడుకులు సైతం సినిమా ఇండస్ట్రీలో ఏ మాత్రం రాణించలేకపోవడంతో వాళ్ళ సినిమాలను జనాలు పట్టించుకోకుండా పోయారు. ఇక మనోజ్ కొంతవరకు సక్సెస్ లను సాధించినప్పటికి ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి దూరం అవ్వడం వల్ల ఆయనను ప్రేక్షకులందరూ మర్చిపోయారు. ఇక రీసెంట్ గా మంచి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని గొడవల కారణంగా అటు మనోజ్, ఇటు మోహన్ బాబు, విష్ణు లు మీడియాలో నిలిచారు. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ‘భైరవంకి (Bhairabam) సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈనెల 30వ తేదీన చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్లో యాంకర్ సుమ మనోజ్ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ లో ఎవరికో ఒకరికి ఫోన్ చేయమని చెప్పగా మనోజ్ తమిళ్ నటుడు అయిన శింబు కి కాల్ చేసి మాట్లాడాడు. ఇక శింబు సైతం చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. శింబు గురించి మనోజ్ చాలా గొప్పగా మాట్లాడుతూ చేస్తున్న ‘తగ్ లైఫ్’ (Thug Life) సినిమా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Also Read : మంచు లక్ష్మి తనకు అక్క కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్!
కాబట్టి ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే కమల్ హాసన్ తో నటించే అవకాశం దక్కినందుకు సంతోషం గా ఉంది. నువ్వు మంచి నటుడు అంటూ శింబు గురించి చాలా గొప్పగా మాట్లాడి అతనిని 10 వేల రూపాయలు పంపివ్వమని అడిగాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు.
ఇక శింబు సైతం మనోజ్ గురించి మాట్లాడుతూ మనోజ్ ఒక చిన్న పిల్లాడు లాంటోడు అతనితో ప్రేమగా ఉంటే ప్రేమిస్తాడు, అదే కోపంగా ఉంటే కోపగిస్తాడు అంటూ మనోజ్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన ‘భైరవం’ (Bhairvam) సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మొత్తానికైతే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ శింబు తో మాట్లాడడం అనేది స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలింది…