Lakshmi Manchu: కాలం కలిసిరాలేదు కానీ మంచు లక్ష్మి హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఊపేయాల్సిసింది. ఆ కోరిక తీరకున్నా… హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ షో చేస్తుంది. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి అందాల ప్రదర్శన ఎక్కువైంది. ట్రెండీ దుస్తుల్లో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ ట్రై చేసింది. మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ఇక హేటర్స్ ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు. మనసుండాలి కానీ వయసుతో పనేముంది. ఇష్టం వచ్చినట్లు తయారు కావడమే అని పరోక్షంగా మంచు లక్ష్మి హింట్ ఇస్తున్నారు.
లక్ష్మి హీరోయిన్ గా చాలా ప్రయత్నాలే చేశారు. గుండెల్లో గోదారి, లక్ష్మీ బాంబ్, దొంగాట వంటి చిత్రాల్లో ఆమె మెయిన్ లీడ్ చేశారు. అవన్నీ నిరాశపరిచాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. తాజాగా ఆమె హీరోయిన్ గా మరో ప్రయత్నం చేస్తుంది. అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. అగ్ని నక్షత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. మంచు లక్ష్మి తండ్రి మోహన్ బాబు కీలక రోల్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుంది.
ఇటీవల మంచు ఫ్యామిలీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నారు. భూమా మౌనికతో ఆయన ఏడడుగులు వేశారు. ఈ వివాహాన్ని మోహన్ బాబు, విష్ణు వ్యతిరేకించారు. మంచు లక్ష్మి ఒక్కటే తమ్ముడు పక్షాన నిలబడింది. అన్నీ తానై తన నివాసంలో మనోజ్ పెళ్లి చేసింది. మనోజ్-విష్ణు మధ్య విబేధాలు నెలకొన్నాయి. మంచు లక్ష్మి సైతం విష్ణుకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
మోహన్ బాబు వారసులైన ముగ్గురిలో విష్ణు ఒకవైపు మనోజ్, లక్ష్మి మరొక వైపు చేరారు. వివాహం అనంతరం మనోజ్ సోషల్ మీడియాలో విష్ణుతో గొడవకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. ఇది సంచలనమైంది. ఆ వీడియోలో విష్ణు మనోజ్ తో గొడవ పడటం క్లియర్ గా ఉంది. మనోజ్ అన్నయ్య మీద ఆరోపణలు చేశారు. ఇటీవల మనోజ్ బర్త్ డే కాగా… విష్ణు శుభాకాంక్షలు చెప్పలేదు. లక్ష్మి మాత్రం స్పెషల్ వీడియో విడుదల చేసింది. ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.
Marhaba IIFA#iifa2023 #abudhabi pic.twitter.com/GevLILTFQd
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) May 27, 2023