https://oktelugu.com/

Manchu Lakshmi: ట్విట్టర్ లో నెగిటివ్ కామెంట్స్ పై మండిపడ్డ … మంచు లక్ష్మి

Manchu Lakshmi: మంచు ఫ్యామిలీ నుండి తెలుగు తెరకు నటిగా పరిచయమై … మేము సైతం, ప్రేమతో మీ లక్ష్మి వంటి టీవీ షోలతో మంచి గుర్తింపు పొందారు లక్ష్మి. ప్రస్తుతం ఆహా యాప్ లో వస్తున్న ఆహా భోజనంబు వంటి షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎదుటివాళ్ల మాటను అర్థం చేసుకోకుండా… ఛాన్స్‌ దొరికితే చాలు కామెంట్‌ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారని నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 17, 2021 4:48 pm
    Follow us on

    Manchu Lakshmi: మంచు ఫ్యామిలీ నుండి తెలుగు తెరకు నటిగా పరిచయమై … మేము సైతం, ప్రేమతో మీ లక్ష్మి వంటి టీవీ షోలతో మంచి గుర్తింపు పొందారు లక్ష్మి. ప్రస్తుతం ఆహా యాప్ లో వస్తున్న ఆహా భోజనంబు వంటి షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎదుటివాళ్ల మాటను అర్థం చేసుకోకుండా… ఛాన్స్‌ దొరికితే చాలు కామెంట్‌ చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారని నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తన సోదరుడు మంచు విష్ణు గురించి ఆమె చేసిన ఓ ట్వీట్‌పై పలువురు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. వీటిపై స్పందించైనా ఆమె నెటిజన్లపై ఫైర్ అయ్యారు.

    manchu-lakshmi-fires-on-negative-comments-on-her-twitter-account

    ఇటీవల ‘మా’ ఎన్నికలలో మంచు లక్ష్మీ… సోదరుడు విష్ణు విజయం సాధించగా నిన్న ప్రమాణ స్వీకార వేడుక జరిగింది. అయితే ఈ సంధర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ … లక్ష్మీ మంచు ఒక ట్వీట్ చేశారు. ” ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం… నా సోదరుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌, నాకెంతో గర్వంగా ఉంది, నువ్వు ఎలాంటి మార్పులు చేస్తావో అని మంచు లక్ష్మి ట్వీట్‌ చేశారు.

    https://twitter.com/LakshmiManchu/status/1449280699651948544?s=20

    అయితే ఆమె ట్వీట్‌పై నెటిజన్లు పలువురు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్ చేస్తూ … ‘‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు’’ అంటూ సెటైర్లు వేశారు. దీంతో నెటిజన్లకు తనదైన రీతిలో గట్టి సమాధానం ఇచ్చారు మంచు లక్ష్మి. నా దృష్టిలో సినిమా అనేది నటులకు ఒక ప్రపంచం లాంటిదని… మీరు అనుకునేలా ప్రపంచాన్ని మార్చడం కాదని మా అసోసియేషన్‌ ప్రపంచాన్ని మార్చడం అని ఆమె వివరణ ఇచ్చారు.