Manchu Lakshmi: మంచు కుటుంబం లో ప్రస్తుతం మంచి ప్రజాధారణ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మంచు మనోజ్(Manchu Manoj) మాత్రమే. ఈ ఫ్యామిలీ హీరోలందరూ నేటి తరం ఆడియన్స్ కి ట్రోల్ మీమ్స్ ద్వారానే ఎక్కువగా పరిచయం. కానీ మంచు మనోజ్ కి మాత్రం మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇచ్చే ప్రసంగాలు, ఆయన కామెడీ టైమింగ్, మరియు ఇతర అంశాలు ఆడియన్స్ ని ప్రత్యేకమ్హా ఆకర్షిస్తాయి. రీసెంట్ గా మంచు కుటుంబం లో జరుగుతున్నా వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వివాదంలో సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్ మొత్తం మంచు మనోజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన క్యారక్టర్ రోల్స్ చేస్తున్నప్పటికీ కూడా,కేవలం ఆయన కారణంగానే ఆయా సినిమాలకు జనాలు కదిలే పరిస్థితి వచ్చింది. అంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడు మనోజ్. రీసెంట్ గా ఆయన తన అక్క మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన దక్ష అనే చిత్రాన్ని ప్రొమోషన్స్ లో మనోజ్ కూడా పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆమె మనోజ్ గురించి మాట్లాడుతూ ‘నాకు మొదట్లో సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ నాలో ఆ ఆసక్తిని కలిగించి నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడేలా చేసింది మాత్రం మనోజ్ నే. గతం లో వాడిని హీరో గా పెట్టి ఎన్నో సినిమాలను నిర్మించాను. బోలెడంత అనుభవం వచ్చింది. ఆ తర్వాత నటించే ప్రయత్నం కూడా చేశాను. అది కూడా సక్సెస్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా నా తమ్ముడు కీలకమైన కష్టాల్లో ఉన్నప్పుడు మిరాయ్ మూవీ సూపర్ హిట్ అవ్వడం వాడికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో,నాకు అంతకు మించిన ఆనందం కలిగింది. వాడు సక్సెస్ కొట్టగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.