Manchu Family: మోహన్ బాబు ఐదు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. విలన్, హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు విలక్షణ పాత్రలు చేశారు. 500 లకు పైగా సినిమాల్లో నటించిన అరుదైన నటుల్లో ఒకరు. నిర్మాతగా కూడా ఆయన రాణించారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించాడు. టాలీవుడ్ బడా ఫ్యామిలీస్ లో మంచు కుటుంబం కూడా ఒకటి. మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. మంచు లక్ష్మి, విష్ణు మొదటి భార్య పిల్లలు. మనోజ్ మాత్రం రెండో భార్య కొడుకు.
విద్యాదేవి మరణం అనంతరం మోహన్ బాబు ఆమె సొంత చెల్లి నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు. విష్ణు, మనోజ్ లను మోహన్ బాబు హీరోలుగా పరిచయం చేశాడు. ఇద్దరిలో ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. ఎలాగైనా నిలబెట్టాలని సొంత బ్యానర్ లో చాలా సినిమాలు కొడుకులు హీరోలుగా మోహన్ బాబు నిర్మించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. తండ్రి ఆయనతో సినిమాలు చేయడం లేదు. బయట నిర్మాతలు ఎవరూ ఆఫర్ ఇవ్వడం లేదు.
అదే సమయంలో జయాపజయాలతో సంబంధం లేకుండా పెద్ద కొడుకు విష్ణుతో మోహన్ బాబు సినిమాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాడు. మోసగాళ్లు టైటిల్ తో చేసిన భారీ బడ్జెట్ మూవీ కనీసం ఆడలేదు. భారీ నష్టాలు మిగిల్చింది. జిన్నా కూడా అంతే. ఆ మూవీలో నటించిన సన్నీ లియోన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా జిన్నా వసూలు చేయలేకపోయింది.
నష్టాలు వస్తున్నా విష్ణుకి మాత్రం సినిమాలు చేసుకునేందుకు మోహన్ బాబు కోట్లకు కోట్లు అందిస్తున్నారు. మనోజ్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నారు. మనోజ్ అహం బ్రహ్మస్మి పేరుతో భారీ బడ్జెట్ మూవీ ప్రకటించాడు. కానీ మోహన్ బాబు సపోర్ట్ చేయలేదు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. విష్ణుతో కన్నప్ప టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ రూ. 100 కోట్లు. ఈ పరిణామాలు మనోజ్ లో అసహనానికి కారణం అయ్యాయని తెలుస్తుంది.
మోహన్ బాబు ఫ్యామిలీకి ప్రముఖ ఆదాయ వనరు తిరుపతిలో గల విద్యాసంస్థలు. మోహన్ బాబు ఆస్తుల పంపకం చేశారు. అయితే విద్యానికేతన్ లో వాటా విషయంలో మనోజ్, మోహన్ బాబు లకు గొడవలు వచ్చాయట. విష్ణుకు దాని బాధ్యతలు అప్పగించాడు మోహన్ బాబు. మనోజ్ కి ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. విద్యాసంస్థల్లో తనకు రావాల్సిన వాటా మనోజ్ అడగ్గా.. డిసెంబర్ 7 శనివారం సెటిల్మెంట్ కి పిలిచారట. అక్కడే మోహన్ బాబు మనుషులు మనోజ్ పై దాడి చేశారట. జరిగిన మేటర్ ఇది అట.