83 Movie: ఇండియన్స్‌కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్డే, టెస్టు, టీ 20, ఇలా మ్యాచ్ ఏదైనా.. సరే.. టీవిలకు అతుక్కుని మరి తీక్షణంగా చూస్తుంటారు. అలాంటిది వరల్డ్ కప్ వస్తే.. ఆ సీజన్ అంతా పండగవాతావరణం నెలకొంటుంది.
క్రికెట్ చరిత్రలో భారత్ కూడా తనకంటూ కొన్ని చరిత్రలు రాసింది. వాటిల్లో ఒకటి తొలి ప్రపంచ కప్ విన్నింగ్ మూమెంట్. తొలిసారి ఇండియా ప్రపంచ కప్ గెలుచుకోవడం అందరికీ ఆనందాన్ని తెచ్చి పెట్టింది. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. అంచనాలన్నీ తారుమారు చేస్తూ.. ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది భారత్. ఆ అపురూప ఘట్టాన్ని ఇప్పుడు సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నున్న సంగతి తెలిసిందే. 83 టైటిల్‌తో వస్తోన్న ఆ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ టీజర్‌ను ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.
The story behind India's greatest victory.
83 RELEASING IN CINEMAS ON 24TH DEC, 2021, in Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.
Teaser out now.
Trailer out on 30th Nov.#ThisIs83@ikamalhaasan @KicchaSudeep @PrithviOfficial @RKFI @AnnapurnaStdios #KichchaCreations pic.twitter.com/Af1WcIOtmL— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2021
ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్ పోషించారు. తమిళ నటుడు జీవా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. దీపికా పదుకొనే, కిచ్చా సుదీప్, జీవా, పంకజ్ త్రిపాఠి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, కబీర్ ఖాన్, దీపికా పదుకొనే, విష్ణు వర్దన్ ఇందూరి, సజీద్ నదియాద్‌వాలా నిర్మాతలు. ఈ క్రమంలోనే నవంబరు 30న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 24న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.