Mass Hero: సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోలకి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. క్లాస్ సినిమాలు ఎన్ని చేసిన రాని గుర్తింపు ఒక్క మాస్ సినిమాతో రావడమే కాకుండా వాళ్ళకి మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. అలాగే మాస్ హీరోలకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాళ్లకి ఉండే మార్కెట్ అయితే తగ్గదు. అంటే వీళ్లకు బీ,సీ సెంటరర్లలో ఎక్కువగా మార్కెట్ ఉండడం వల్ల జనాలు ఎక్కువగా వీళ్ళ సినిమాలను చూస్తు ఆదరిస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి సక్సెస్ టాక్ వచ్చిందంటే చాలు వాళ్ళ సినిమాలని రెండు, మూడు సార్లు చూడడానికి బీ, సీ సెంటర్లోని ఆడియన్స్ ఆసక్తిని చూపిస్తారు. కాబట్టి వీళ్లకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తుంటాయి. అందువల్లే ప్రతి ఒక్క హీరో మాస్ హీరోగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో మాస్ హీరోగా ఎవరు గుర్తింపు పొందుతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లలో ఎవరికి మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
ఎన్టీఆర్ కెరియర్ మొదట్లోనే ఆది, సింహాద్రి లాంటి భారీ మాస్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. తద్వారా ‘మ్యాన్ అఫ్ ది మాసెస్’ గా కూడా తను ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండడమే కాకుండా బీ,సీ సెంటర్లో ఉన్న జనాలు అతని సినిమాలకి నీరాజనం పట్టారు. కాబట్టి ఎన్టీఆర్ పవర్ ఫుల్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడనే చెప్పాలి…
ఇక రామ్ చరణ్ హీరోగా వచ్చిన చిరుత సినిమాతోనే ఆయన మాస్ లో మంచి ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు. అలాగే మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇక రంగస్థలం లాంటి ఒక రివేంజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో కూడా భారీ మాస్ ఎలిమెంట్స్ ని రంగరించి సూపర్ సక్సెస్ ని అందుకోవడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీయార్ ఇద్దరూ కలిసి మాస్ జాతర చేశారనే చెప్పాలి…
ఇక అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాలంటే మొదట ఈయన క్లాస్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత మాస్ సినిమాలను చేస్తూ మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. పుష్ప సినిమాతో మాస్ లో కొంతవరకు తన స్టార్ డమ్ ను అయితే విస్తరించుకోగలిగాడు…
ఇక వీళ్ళ ముగ్గురిలో మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది మాత్రం ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరి తర్వాత అల్లు అర్జున్ మాస్ లో కొంతవరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…