Mana Shankara Varaprasad Interval Scene : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ నిన్న రాత్రి ప్రీమియర్ షోస్ తో చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాకు ఎవ్వరూ ఊహించని రీతిలో సోషల్ మీడియా నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలకు సోషల్ మీడియా లో పాజిటివ్ టాక్ రావడం మనం ఎప్పుడూ చూడలేదు. ఆయన గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అలాంటి సినిమాకు కూడా సోషల్ మీడియా నుండి పాజిటివ్ టాక్ రాలేదు. యావరేజ్ రేంజ్ లో వచ్చింది. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కి అయితే కరుడుగట్టిన చిరంజీవి దురాభిమానికి కూడా తెగ నచ్చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇంటర్వెల్ సన్నివేశం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి తన మామయ్యా కి ధమ్కీ ఇస్తూ ఒక డ్యాన్స్ బిట్ చేస్తాడు. అందులోని కొన్ని లిరిక్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి రాసినట్టుగా అనిపించింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే అలాంటి ఉద్దేశ్యాలు చిరంజీవి కి ఏ మాత్రం ఉండవు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో దశాబ్దాల నుండి మనం చిరంజీవి ని చూస్తూ పెరిగామని, ఏనాడు కూడా ఆయన అవతల వ్యక్తిని బాధపెట్టిన సందర్భం లేదని, తనని తిట్టినవారిపై కూడా ఆయన చాలా సాఫ్ట్ గా రెస్పాన్స్ ఇస్తాడని., సినిమాలో వచ్చే ఒక సందర్భాన్ని తమకు ఆపాదించుకోవడం ఈమధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయిందని, సోషల్ మీడియా లో వినిపిస్తున్నట్టుగా చిరంజీవి ఎవరినీ టార్గెట్ చేయలేదని అంటున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, చాలా కాలం తర్వాత వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని వెండితెర మీద చూశామని సోషల్ మీడియా లో మెగా అభిమానులు ఆనందంతో కంటతడి పెట్టుకుంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నుండి అభిమానులు, ప్రేక్షకులు ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ తో ఉండేవారు. చిరంజీవి అంటే ఎనర్జీ, చిరంజీవి అంటే నేచురల్ యాక్టింగ్, చిరంజీవి అంటే కామెడీ టైమింగ్,వీటి అన్నిటికి మించి చిరంజీవి అంటే గుండెల్ని పిండేసే ఎమోషన్. ఇవన్నీ రీ ఎంట్రీ తర్వాత మిస్ అవుతున్నాయని అభిమానులు పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో ఆ లోటు మొత్తం తీరిపోయింది సంతోషంతో కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Interval punch #ManaShankaraVaraPrasadGaru
Blockbuster first half
— CB (@cinema_babu) January 11, 2026