Mana Shankara Varaprasad Garu unbeaten record: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 5 రోజుల క్రితం ఈ చిత్రం ‘జీ5’ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాకు రన్ ఉండదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ చిత్రం విజయవంతం గా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. మన టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత అత్యధిక సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సినిమాని ‘మన శంకర వరప్రసాద్ గారు’ ద్వారా చూడబోతున్నాం. ఇదంతా పక్కన పెడితే నిన్న కూడా ఈ చిత్రానికి అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి.
కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ సినిమా నిన్నటితో కొన్ని ప్రతిష్టాత్మక బెంచ్ మార్క్స్ ని అందుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలో ఈ చిత్రం నిన్నటితో 7 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని అందుకొని సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే 7 కోట్ల షేర్ మార్కుని అందుకున్నాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఒక మామూలు కమర్షియల్ సినిమాతో ఈ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం ఈ చిత్రం నెల్లూరు జిల్లాలో అత్యధిక షేర్ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో టాప్ 4 స్థానంలో కొనసాగుతుంది. మొదటి స్థానంలో రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో నిలబడగా, 2వ స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం 8 కోట్ల 20 లక్షల రూపాయలతో కొనసాగుతుంది.
ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ‘బాహుబలి 2’ చిత్రం 8 కోట్ల 10 లక్షలతో కొనసాగుతోంది. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సూపర్ హిట్ చిత్రాలు ‘కల్కి 2898 AD’, ‘దేవర’, ‘ఓజీ’, ఇలా ఏ చిత్రం కూడా నెల్లూరు జిల్లా లో 7 కోట్ల షేర్ మార్కుని అందుకోలేదు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి ఒక మామూలు కమర్షియల్ సినిమాని ఏసుకొచ్చి, నాలుగు సినిమాలతో పోటీ పడుతూ ఈ రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక దాదాపుగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రన్ పూర్తి అయ్యినట్టే. ఇక కేవలం రెండు నుండి మూడు లక్షలు షేర్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘పెద్ది’ చిత్రాలు దాటుతాయో లేవో చూడాలి.