Mana Shankara Varaprasad Garu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి – అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన కామెడీని బాగా చేస్తాడు. అలాగే ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీస్తాడు. ఇక కమర్షియల్ గా ఆ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది కాబట్టి ఆయన అనిల్ తో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కూడా నటిస్తున్నాడు అనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ తో పాటు మరొక యంగ్ హీరో కూడా ఇందులో క్యామియో రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన ఎవరు అనే విషయాన్ని అఫిషియల్ గా చెప్పనప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్2, ఎఫ్3 సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ చేసిన కామెడీ ప్రేక్షకులందరికి విపరీతంగా నచ్చింది.
కాబట్టి ఈ సినిమాలో సైతం వరుణ్ తేజ్ ను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడు వరుణ్ కూడా ఇందులో భాగం చేశారట. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడం వరుణ్ తేజ్ కి కూడా డ్రీమ్ అని గతంలో వరుణ్ తేజ్ చెప్పిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి అతనిని కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా చిరంజీవికి ఎలాంటి విజయాన్ని అందిస్తోంది. అనిల్ రావిపూడి మరోసారి తన కామెడీతో సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…