Mahesh Babu: సూపర్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… కెరియర్ మొదట్లోనే స్టార్ హీరోగా తన సత్తా చాటాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మెన్ లాంటి సినిమాలతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఇప్పుడు రాజమౌళితో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తన స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు వారణాసి సినిమా అతన్ని మరో మెట్టు పైకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇప్పటికే గౌతమ్ కృష్ణ మహేష్ బాబు నటించిన వన్ సినిమాలో మహేష్ చైల్డ్ క్యారెక్టర్ గా నటించాడు.
ఆ సినిమాలో అతని నటన బావుందంటూ విమర్శకులు సైతం ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన ఫుల్ టైం హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యే సమయమైతే ఆసన్నమైంది అంటూ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ సైతం సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గౌతమ్ కృష్ణ ఫస్ట్ సినిమా కోసం మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాను రీమేక్ చేసే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మహేష్ బాబు సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ ఒక్కడు సినిమాను రీమేక్ చేస్తే మాత్రం గౌతమ్ కృష్ణకు అది మంచి డెబ్యూ సినిమాగా మారుతోంది అని ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చూడాలి మరి గౌతమ్ కృష్ణ సైతం మహేష్ బాబు రేంజ్ లో స్టార్ హీరోగా ఎదుగుతాడా లేదా అనేది…