Mana Shankara Varaprasad Garu OTT sensation: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, సరిగ్గా 31 రోజులు పూర్తి అయ్యింది. ఈ 31 రోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు సాధారణమైనవి కావు. కొన్ని పాన్ ఇండియన్ చిత్రాలకు కూడా ఈ సినిమాకు వచ్చినన్ని రికార్డ్స్ రాలేదు. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగానే రన్ అవుతోంది. అయితే ఓటీటీలో ముందుగా అనుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాని నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కాబట్టి, రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ‘జీ 5’ లో విడుదల చేశారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది.
‘జీ5’ సంస్థ వారు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ల వాచ్ మినిట్స్ వచ్చాయని, ‘జీ5’ హిస్టరీ లోనే తెలుగు సినిమాల క్యాటగిరీ లో ఇదొక ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. ఇదే తరహా జోరును కొనసాగిస్తూ ముందుకు పోతే, ఈ చిత్రం కచ్చితంగా జీ5 లో #RRR రికార్డు ని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. అనిల్ రావిపూడి గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఇదే ‘జీ5’ యాప్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. సుమారుగా ఆరు నెలల పాటు ఈ చిత్రం ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంతకు మించి ట్రెండ్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా థియేటర్స్ లో ఎగబడి చూసిన ఒక సినిమాకు, ఓటీటీ లో పెద్దగా వ్యూస్ రావేమో అని అంతా అనుకుంటారు , కానీ ఈ సినిమాకు అలా జరగలేదు.
ఒకసారి చూసిన వాళ్ళే , పదే పదే ఈ చిత్రాన్ని చూడడం వల్లే, ఈ రేంజ్ వ్యూయర్షిప్ వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈపాటికి షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు అవ్వాల్సింది. కానీ నిర్మాత కొంత ఆర్ధిక సంక్షోభం లో చిక్కుకోవడం వల్ల, షూటింగ్ మొదలు అవ్వడం కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. అప్పటి లోపు లొకేషన్స్ ని, సినిమాలో నటించే నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడట డైరెక్టర్ బాబీ. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.