Mana Shankara Varaprasad Garu OTT Record: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డ్స్ ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేటి తరం యువతకు అసలు అర్థ శత దినోత్సవం అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది ఈ చిత్రం అతి త్వరలోనే దాదాపుగా విడుదలైన అన్ని సెంటర్స్ లోనూ అర్థ శత దినోత్సవం జరుపుకోబోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 310 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11 న ‘జీ5’ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిపీట్ లో చూసేసారు కదా, దాదాపుగా కోటి టికెట్స్ అమ్ముడుపోయాయి, ఇక ఓటీటీ లో ఏమి చూస్తారులే అని చాలా మంది అనుకున్నారు.
కానీ థియేటర్స్ లో ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుందో, ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘జీ5’ సంస్థ అందిస్తున్న గణాంకాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారంలో 500 మిలియన్ల వాచ్ హావర్స్ వచ్చాయని అంటున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. అంతే మొదటి వారం లో 6 మిల్లియన్లకు పైగానే వ్యూస్ వచ్చాయి అన్నమాట. ‘జీ5’ హిస్టరీ లో మొదటి వారం #RRR తర్వాత ఆ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఏకైక చిత్రం ఇదేనంటూ సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇంకా ఎన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుందో చూడాలి. మెగా అభిమానులకు ఈ చిత్రం ఇచ్చిన జోష్, ఉత్సహం మామూలుది కాదు. ఓజీ చిత్రం సక్సెస్ తో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన మెగా ఫ్యాన్స్, ఈ సినిమా సక్సెస్ తో మరింత సంతోషానికి గురయ్యారు.
ఇక రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న ప్రతీ సినిమా సక్సెస్ అవ్వబోతుంది అనే బలమైన నమ్మకం తో ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఉగాది నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. ఆయనకు జోడిగా ఐశ్వర్య రాయ్ నటించబోతుంది. ఇక చిరంజీవి కి కూతురుగా ఛాంపియన్ హీరోయిన్ అనశ్వర రాజన్ నటించబోతుంది. అదే విధంగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు.