Mana Shankara Varaprasad Garu 11 Days Collections: మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ ప్రతీ రోజు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. భోగి పండగకు రెండు రోజుల ముందు ఈ చిత్రం విడుదలైంది. సాధారణంగా ప్రీ ఫెస్టివల్ లో ఏ సినిమాకు అయినా కలెక్షన్స్ చాలా వీక్ గా ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం దంచికొట్టేసింది. ఇక పండగ సెలవుల్లో అయితే వార్ వన్ సైడ్ అన్నట్టు సిక్సర్లు మీద సిక్సర్లు కొట్టేసాడు మెగాస్టార్. పండగ ముగిసిన తర్వాత వర్కింగ్ డేస్ లో బాగా డౌన్ అయిపొతుందెమో అని అనుకున్నారు. కానీ అసలు తగ్గలేదు. రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంది ఈ చిత్రం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 10వ రోజు కంటే 11 వ రోజు ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుపోవడం.
10వ రోజు ఈ యాప్ ద్వారా 49 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోగా, 11వ రోజున ఏకంగా 55 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఎందుకంటే 11 వ రోజున ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్స్ తగ్గాయి. అన్ని ప్రాంతాల్లో టికెట్స్ అమ్ముడుపోయే సంఖ్య భారీ గా పెరిగింది. ముఖ్యంగా B,C సెంటర్స్ లో నిన్న భారీ స్థాయిలో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. ఇక నేటి సాయంత్రం నుండి సోమవారం రాత్రి వరకు ఈ సినిమాకు వచ్చే వసూళ్లు , నమోదు అయ్యే హౌస్ ఫుల్స్ ని చూసి ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబెడుతారు, ఆ రేంజ్ లో ఉండబోతున్నాయి. టికెట్ రేట్స్ తగ్గితే థియేటర్స్ కి వెళ్లి చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లంతా ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతారని అంటున్నారు విశ్లేషకులు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 11వ రోజున 1 కోటి 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. 10వ రోజున రెండు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల టికెట్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి కానీ, కలెక్షన్స్ మాత్రం తగ్గాయని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 255 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రాబోయే నాలుగు రోజుల్లో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ మేకర్స్ మాత్రం అప్పుడే ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ దాటినట్టు పోస్టర్లు వేసేసారు, ఇది కాస్త వివాదాలకు దారి తీసింది.