Homeఅంతర్జాతీయంTrump threatens Iran again: టెంపరితనం చూపిన ట్రంప్‌.. ఇరాన్‌కు మళ్లీ బెదిరింపులు

Trump threatens Iran again: టెంపరితనం చూపిన ట్రంప్‌.. ఇరాన్‌కు మళ్లీ బెదిరింపులు

Trump threatens Iran again: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ వెనెజువెలా ఆయిల్‌ కోసం సైలెంట్‌ ఆపేషన్‌తో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురోను, ఆయన భార్యను అర్ధరాత్రి ఎత్తుకొచ్చాడు. న్యూయార్క్‌ కోర్టులో దోషిగా ప్రవేశపెట్టాడు. ఇక వెనెజువెలాలో ఆయిల్‌ను తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఇరాన్‌పై దృష్టి పెట్టాడు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళన చేస్తున్న ప్రజలకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఆందోళనలను అణచివేస్తే దాడి చేస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని హెచ్చరించారు. అయితే సడనెన్‌గా ఇటీవల ట్రంప్‌ స్వరం మారింది. చర్చలు జరుపుతామని ప్రటకించారు. దీంతో యుద్ధం ఉండదని భావించారు. కానీ, ట్రంప్‌ మళ్లీ తన టెంపరితనం చూపించారు. చల్లారినట్టు కనిపించిన అమెరికా–ఇరాన్‌ ఘర్షణ మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్‌ వైపు భారీ నౌకాదళ బలగాలను పంపుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సైనిక చర్యలకు దారితీయకుండా ఉండాలని హెచ్చరించారు. ఇరాన్‌ మాత్రం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమని తిప్పికొట్టింది.

అణు కార్యక్రమం, సైనిక కదలికలు
అధికారుల నివేదిక ను స్వయంగా సమీక్షిస్తున్నానని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పునరావృతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ క్యారియర్, డిస్ట్రాయర్లు, యుద్ధవిమానాలు మధ్యప్రాచ్యానికి తరలుతున్నాయని తెలిపారు. అదనపు వాయు రక్షణ వ్యవస్థలు పరిగణనలో ఉన్నాయన్నారు.

ఇరాన్‌లో నిరసనలు
మరోవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రారంభమైన ఇరాన్‌ నిరసనలు దేశవ్యాప్తమయ్యాయి. మానవహక్కుల సంస్థలు వేలాది మరణాలు, అరెస్టులు నమోదాయింది. భద్రతా సిబ్బంది కూడా భారీగా మరణించారు. నిరసకులపై దేశద్రోహ కేసులు, ఉరిశిక్షలు ప్రణాళికలో ఉండగా, అమెరికా ఒత్తిడితో 837 మందిని కాపాడినట్టు ట్రంప్‌ పేర్కొన్నారు. దీనితో సైనిక చర్యలు వాయిదా పడ్డాయి.

దావోస్‌లో ట్రంప్‌ వ్యాఖ్యలు..
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌లో ట్రంప్‌ ఇరాన్‌ అణు పునరుద్ధరణపై హెచ్చరించారు. ఐఅఉఅ తనిఖీలు ఆగిపోయి, యురేనియం నిల్వలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇది మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు కారణమవుతుంది.

అమెరికా దాడి జరిగితే ప్రతీకారం తప్పదని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి హెచ్చరించారు. సైన్యం పూర్తి శక్తితో ఎదుర్కొంటుందని, యుద్ధం విస్తరించి అమెరికా బేసులు, ఇజ్రాయెల్‌ ప్రమాదాల్లో పడతాయని పేర్కొన్నారు. అణు అంశంపై మాత్రం స్పందన లేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular