Mana Shankara Varaparasad Garu Movie Talk: రీసెంట్ గా విడుదలైన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రానికి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ రావడం తో కాస్త మెగా(Megastar Chiranjeevi) ఫ్యాన్స్ లో కూడా ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఈ నెల 12న విడుదల అవ్వబోయే ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaparasad Garu) చిత్రం కూడా ఇదే కామెడీ జానర్ లో తెరకెక్కినదే కాబట్టి, యూత్ ఆడియన్స్ సోషల్ మీడియా లో ఎక్కడ క్రింజ్ సినిమా అంటూ నెగిటివ్ టాక్ చెప్తారో అని భయపడుతున్నారు. అనిల్ రావిపూడి హిస్టరీ లో ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా సోషల్ మీడియా లో పూర్తి స్థాయి పాజిటివ్ టాక్ రాలేదు. ఆయన గత చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆన్లైన్ లో మాత్రం ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే దుబాయి లో ఈ చిత్రానికి సంబందించిన మొదటి కాపీ ని కొంతమంది మీడియా ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ మొత్తం అనిల్ రావిపూడి స్టైల్ టేకింగ్ తో ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుందని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డౌన్ అయ్యిందని, చాలా సన్నివేశాలు అంతకు ముందు సినిమాల్లో చూసినట్టు గా అనిపించాయని, మెగాస్టార్ చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో సెకండ్ హాఫ్ ని నిలబెట్టే ప్రయత్నం చేసాడని , కానీ అది ఆడియన్స్ కి ఎంత మేరకు నచ్చుతుందో చూడాలని అంటున్నారట. కానీ ఎప్పుడైతే విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఉంటుందో, అప్పటి నుండి సినిమా వేరే లెవెల్ కి వెళ్తుందని, చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ సన్నివేశం బాగా పేలిందని అంటున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో రవితేజ క్యారక్టర్ ఆ సినిమాకు బ్యాక్ బోన్ లాగా ఎలా అయితే నిల్చిందో, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా వెంకటేష్ పాత్ర ఆ రేంజ్ లో నిల్చిందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది కానీ, సంక్రాంతి వస్తున్నాం రేంజ్ లో సూపర్ హిట్ అయ్యి, 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది మాత్రమే చూడాలని అంటున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాలేదు కానీ , ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసిన హుక్ స్టెప్ పాటకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట కారణంగానే ఈ సినిమాపై హైప్ పెరిగిందని, ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.