Mana Shankara Vara Prasad Garu Chiranjeevi Speech: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad garu) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మరియు మూవీ టీం మొత్తం హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో వెంకటేష్ ఎనర్జీ, మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన స్పీచ్ హైలైట్స్ గా నిలిచాయి. అభిమానుల్లో సరికొత్త జోష్ ని నింపాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చూస్తున్నంతసేపు ఎదో సక్సెస్ మీట్ ని చూస్తున్న అనుభూతి కలిగింది. చాలా అరుదుగా ఇలాంటి అనుభూతులు మనకు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే చిరంజీవి కి సర్జరీ అయినప్పటికీ కూడా అరగంటసేపు ఓపికతో అభిమానులతో మాట్లాడిన మాటల్లోని హైలైట్స్ కొన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
ఆయన మాట్లాడుతూ ‘ అదిరిపోద్ది సంక్రాంతి అంటూ మా సినిమా నుండి రీసెంట్ గానే నేను , వెంకటేష్ కలిసి వేసిన డ్యాన్స్ సాంగ్ ని విడుదల చేసాము. అదిరిపోద్ది సంక్రాంతి అంటే, మా ఒక్క సినిమా మాత్రమే కాదు, సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని. మన అందరి డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్, అన్నయ్య అంటూ ప్రేమగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా, చిన్నతనం నుండి మా ఇంట్లో తిరుగుతూ పెరిగిన శర్వానంద్ సినిమా, నన్ను గురువుగా భావించిన నవీన్ పోలిశెట్టి సినిమా, ఇలా అందరి సినిమాలు సక్సెస్ అవ్వాలి, అయ్యేలా చేస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ మా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, కొన్నేళ్ల క్రితమే నాతో చెప్పాడు. అనిల్ రావిపూడి సినిమాల్లోని కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది, నువ్వు అతనితో కలిసి సినిమా చేస్తే చూడాలని నాకు ఆశగా ఉందని అన్నాడు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టించాము. అనిల్ రావిపూడి నాకు ఈ కథ చెప్పగానే, మంచి ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, పర్ఫెక్ట్ కమర్షియల్, దీన్ని కాస్త వైవిధ్యంగా చేద్దాం అని అన్నాను. అప్పుడు అనిల్ సార్ నాకు వైవిధ్యంగా వద్దు, మీ పాత సినిమాలు అయినటువంటి రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, ఘరానా మొగుడు, చంటబ్బాయ్ లో ఎలా కనిపించారో, అలా నేను చూపించాలని అనుకుంటున్నాను. అప్పటి మీ అభిమానులు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, నేటి తరం వాళ్లకు మీ వింటేజ్ కామెడీ టైమింగ్ ని చూపించాలి అని చెప్పాడు. ఈ షూటింగ్ మొత్తం ఒక పిక్నిక్ లాగా సాగిపోయింది. షూటింగ్ చివరి రోజు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, ఇలా నా జీవితం లో ఎప్పుడూ ఎమోషనల్ అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియోలో చూడండి.
