Mana Shankara Vara Prasad Garu: ఈ ఏడాది ప్రారంభం లో డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం ద్వారా సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఒక సీనియర్ హీరో చిత్రం 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటిది అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో ఒక ప్రాంతీయ భాష చిత్రం చేసి ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడాన్ని కచ్చితంగా చరిత్ర లో ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి సెన్సేషన్ తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megatsar Chiranjeevi) తో ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu Movie) అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి
వివరాల్లోకి వెళ్తే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరో గా ‘డాడీ’ అనే చిత్రం తెరకెక్కింది గుర్తుందా?, ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ అప్పట్లో హిట్ చేయలేకపోయారు కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం చాలా పెద్ద హిట్ చేశారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీ లో వచ్చినప్పుడు డీసెంట్ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ ని నమోదు చేసుకుంటూ ఉంటుంది. ఈ చిత్రం తర్వాత ఇదే తరహా స్టోరీ ని కాస్త అటు ఇటు మార్చి విక్టరీ వెంకటేష్ తో తులసి అనే చిత్రం చేశారు. అది కూడా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత 8 ఏళ్ళ క్రితం తమిళ హీరో అజిత్ కుమార్ ‘విశ్వాసం’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాని చూసినప్పుడు కూడా మనకు ‘డాడీ’ చిత్రం గుర్తుకు రాక తప్పదు.
ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో చేస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం కూడా ఇదే తరహా లో ఉంటుందట. ఇందులో చిరంజీవి, నయనతార కి మధ్య గొడవలు జరిగి కొంతకాలం విడిపోవడం, చిరంజీవి కుటుంబానికి దగ్గర అవ్వాలని చూడడం, తన కూతురు చదువుతున్న స్కూల్ లో డ్రిల్ల్ మాస్టర్ గా చేరడం వంటివి చేస్తారట. అంతే కాదు చిరంజీవి తో విడిపోయిన తర్వాత హీరోయిన్ నయనతార ఇంట్లో రెండవ పెళ్లి విక్టరీ వెంకటేష్ తో చెయ్యాలని అనుకోవడం, తన స్నేహితుడి మాజీ భార్య ని పెళ్లి చేసుకోబోతున్నాను అనే విషయం తెలుసుకొని, వెంకటేష్ చిరంజీవి, నయనతార ని మళ్లీ కలపడంతో సినిమా పూర్తి అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ఇదే కనుక నిజమైతే ఆడియన్స్ కాస్త రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే లో పొట్ట చెక్కలయ్యే కామెడీ ని జోడించి బ్లాక్ బస్టర్ కొట్టడం అనిల్ రావిపూడి కి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, ఈ సినిమాని కూడా అదే రేంజ్ తెరకెక్కిస్తాడని అనుకుంటున్నారు నెటిజెన్స్.