Bigg Boss 9 Telugu Nagarjuna: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu ) హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా దివ్వెల మాధురి రాబోతుంది అనే వార్త తెలిసినపుడే, ఆమ్మో ఈమె ఎందుకు వస్తుంది అని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్టు గానే హౌస్ లోకి ఈమె ఫైర్ బ్రాండ్ లాగా అడుగుపెట్టింది, ఆమెని చూసి కంటెస్టెంట్స్ కూడా భయపడ్డారు. తనూజ అయితే ‘ఆమ్మో ఫైర్ బ్రాండ్ లాగా ఉందిగా..ఈమెతో చాలా కష్టం’ అని ఆమె అడుగు పెట్టిన రోజే ఇమ్మానుయేల్ తో అనడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కానీ బయట తనూజ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి, ఆమె తో ఉంటే ఆమె ఓట్లు కూడా కలిసొస్తాయి అనే ప్లాన్ తో ఆమెతో మాత్రం స్నేహంగా ఉంటుంది అని అందరి అభిప్రాయం. అయితే గత వారం ఆడియన్స్ లో తన ప్రవర్తన పట్ల తీవ్రమైన నెగిటివిటీ ఉంది అనే విషయాన్ని గ్రహించింది మాధురి.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
అప్పటి నుండి ఆమె మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేసింది కానీ, ఎంత ప్రయత్నం చేసినా తన ఒరిజినాలిటీ ని మాత్రం దాచిపెట్టలేకపోయింది. శుక్రవారం, శనివారం ఎపిసోడ్స్ లో రీతూ చౌదరి మరియు సాయి లపై ఏ రేంజ్ లో నోరు పారేసుకుందో మనమంతా చూసాము. ఈమెకు ఇంత బలుపు ఎందుకు?, సీఎం, పీఎం కుటుంబాలకు చెందిన వాళ్ళు కూడా ఈ రేంజ్ ఫోజులు కొట్టరేమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రీతూ చౌదరి ని ఉద్దేశిస్తూ తనూజాతో ఆమె మాట్లాడుతూ ‘బయట కానీ ఇలాంటి పనులు చేస్తే, క్రింద పడేసి కొట్టేదాన్ని’ అని అంటుంది. ఇక ఆ అంశం పై రీతూ చౌదరి, మాధురి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నాగార్జున ఆ వీడియో ని ప్లే చేసి మాధురి ని తిట్టిన తీరు వేరే లెవెల్ అని చెప్పొచ్చు.
‘మీరు తోపులు అయితే బయట చూపించుకోండి అమ్మా..ఇది బిగ్ బాస్ హౌస్’ అంటూ ఆమె ముఖం మీదనే నాగార్జున చెప్తాడు. దానికి మాధురి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదు, సైలెంట్ గా అలా చూస్తూ ఉండిపోతుంది. హౌస్ లో ఈమె ప్రవర్తన స్టైల్ ఏమిటంటే, ఈమెకు కోపం వచ్చినప్పుడు ఆమె అందరి మీద నోరు పారేసుకుంటుంది, దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే మాత్రం తీసుకోలేదు. నోరు తగ్గించు అని వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఒకసారి కాదు, చాలా సార్లు చేసింది. బిగ్ బాస్ హౌస్ ఎలాంటి వారిని అయినా మార్చి బయటకు పంపుతుంది. అలా మాధురి కూడా ఇంటికి వెళ్లే లోపు ప్రవర్తన లో మార్పు వస్తుందో లేదో చూడాలి. వచ్చేవారం ఈమె డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి వెళ్ళింది. కాబట్టి కచ్చితంగా ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.