Mana Shankara Vara Prasad Garu Budget: ‘భోళా శంకర్’ వంటి భారీ ఫ్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్ గారు’. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం కావడం, అందులోనూ చిరంజీవి చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫ్యామిలీ జానర్ చిత్రం చేస్తుండడం, అందులో విక్టరీ వెంకటేష్ కూడా ప్రధాన పాత్ర పోషించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటి అన్నిటికి తోడు ఈమధ్యనే విడుదలైన ‘మీసాల పిల్ల ‘ సాంగ్ పెద్ద హిట్ అయ్యి, యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ కి దగ్గర అవ్వడం ఇంకా ప్లస్ అయ్యింది అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ఒక చిన్న సమస్య ఎదురైంది.
Also Read: రాజమౌళి అంత లేదా? బాహుబలి ఎటర్నల్ వార్ టీజర్ లో ఆ డోస్ కనిపించలేదే..?
వివరాల్లోకి వెళ్తే అనిల్ రావిపూడి నిర్మాతలకు చాలా అనుకూలంగా ఉండే డైరెక్టర్ అని అంతా అంటుంటారు. ఎందుకంటే ఆయన ప్రతీ సినిమాని తక్కువ బడ్జెట్ తోనే, తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ కంటే తక్కువ రోజుల్లో షెడ్యూల్ పూర్తి చేయడం, డబ్బులు మిగిలించడం వంటివి కూడా చేశాడు. కానీ ‘మన శంకర్ వరప్రసాద్’ చిత్రానికి మాత్రం బడ్జెట్ కంట్రోల్ తప్పిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. సినిమా బడ్జెట్ తక్కువలో పూర్తి చేసినా రెమ్యూనరేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయని టాక్. ఒక్క మెగాస్టార్ చిరంజీవి కే 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నారట.
అదే విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పాతిక కోట్ల రూపాయిలు, హీరోయిన్ నయనతార 10 కోట్లు, ప్రధాన పాత్ర పోషిస్తున్న విక్టరీ వెంకటేష్ 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారట. ఇలా సినిమాకు కీలకమైన ఈ నలుగురి రెమ్యూనరేషన్స్ 155 కోట్లకు చేరింది. ఇక సినిమా బేసిక్ బడ్జెట్ కలిపి 200 కోట్ల రూపాయిలు దాటింది అని సమాచారం. కానీ ఆ రేంజ్ లో బిజినెస్ జరగడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఎందుకంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 400 కోట్ల గ్రాస్ ని కచ్చితంగా రాబట్టాలి. అంత గ్రాస్ సంక్రాంతి లో నాలుగైదు సినిమాలతో పోటీ పడాలి. లేదా మొదటి రోజు వంద కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ ని అయినా రాబట్టాలి. ప్రస్తుతానికి చిరంజీవి కి అంతటి ఓపెనింగ్ వచ్చే పరిస్థితులు లేవు. అందుకే బిజినెస్ నిర్మాతలు కోరుకున్న రేంజ్ లో జరగడం లేదు. రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి.