CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరా డుతోంది. అదే సమయంలో కూటమి పట్టు బిగిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను వెంటాడుతోంది. వైసిపి హయాంలో చేసిన తప్పులు, తాజాగా జరుగుతున్న తప్పిదాలపై పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు కేసుల నమోదు ప్రక్రియ సైతం అదే స్థాయిలో ఉంది. అయితే ఒక పద్ధతి ప్రకారం అరెస్టులు నడుస్తున్నాయి. దీని వెనుక పక్క వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఎలా మేనేజ్ చేశారో.. వాటిపైనే దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముందుగా జగన్ చుట్టూ ఉన్న నేతల వలయాన్ని ఛేదించే పనిలో పడింది. ఇటీవల కేసుల నమోదు తో పాటు అరెస్టుల పర్వం చూస్తుంటే ఇది ఇట్టే అర్థమవుతోంది.
జోగి రమేష్ ( Jogi Ramesh) అరెస్ట్ నే తీసుకుందాం. ఆయనపై పాత కేసుల్లో అరెస్టు చేయలేదు. కల్తీ మద్యం వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వంపై ఎగదోసి చెడ్డ పేరు వచ్చేలా చేయాలనుకున్నారు. కానీ దీనిపై సూక్ష్మ శోధన చేసింది కూటమి ప్రభుత్వం. తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జి పై ఆరోపణలు, అనుమానం వచ్చిన మరుక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రధాన నిందితుడిని వెంటాడింది. ఆయనను విదేశాల నుంచి రప్పించింది. కుట్ర కోణంలో అనుమానించి తెరవెనుక జరిగిన దాని గురించి తెలుసుకుంది. అయితే అప్పటికే జోగి రమేష్ హడావిడి చేశారు. ఆ హడావిడి వెనుక ఆయన హస్తం ఉందని తేలిపోయింది. పక్కా ఆధారాలు సేకరించగలిగింది. కూటమి ప్రభుత్వం హయాంలో వైసీపీ కల్తీ మద్యం చేయించిందని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కూటమి సక్సెస్ అయింది. ఏ కల్తీ మద్యం వ్యవహారంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని భావించారో.. అదే కల్తీ వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ మేడకు తగిలించారు సీఎం చంద్రబాబు.
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ తరుణంలో ఆ పార్టీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. అయినా జగన్మోహన్ రెడ్డిలో ఎనలేని ధీమా కనిపిస్తూ వస్తోంది. ఆపై వలయంలా చాలామంది నేతలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎంత పట్టు బిగించినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ తరుణంలో వారిని పక్కకు తప్పించాలన్న పక్కా వ్యూహం వేస్తారు సీఎం చంద్రబాబు. చివరకు యాంకర్ శ్యామలా లాంటి వారు సైతం ప్రభుత్వం పై ఆరోపణలు కొనసాగిస్తున్నారు. జోగి రమేష్ లాంటి నేతలు సైతం సవాల్ చేస్తున్నారు. అందుకే వీరిపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్టులు చేశారు. కేసుల నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( chevereddy Bhaskar Reddy) , పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి నేతల నుంచి జోగి రమేష్ వరకు అరెస్టుల పర్వం చూస్తుంటే పక్క వ్యూహంతోనని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరు ఉండకూడదు. ఏం మాట్లాడకూడదు. వారితో రాజకీయం చేసే లబ్ధి పొందాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రణాళికను గుర్తించారు చంద్రబాబు. అందుకే రివర్స్ వ్యూహం పన్నారు. పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టు అనుకూల వాతావరణం కూడా ఉంది.