Baahubali Eternal War Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు రాజమౌళి…ఆయన చేసిన బాహుబలి తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది… అంత భారీ బడ్జెట్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించవచ్చు అని నిరూపించిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…ఇప్పటివరకు రాజమౌళి చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించినప్పటికి బాహుబలి అనేది అతని కెరియర్ లోనే గుర్తుండిపోయే సినిమా…ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని చేసిన సినిమా బాహుబలి… అలాంటి ఒక బాహుబలి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక కొత్త సంతకం చేసిందనే చెప్పాలి…ఇక ప్రస్తుతం బాహుబలి రెండు పార్ట్ లను కలిపి రాజమౌళి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఇషాన్ శుక్ల డైరెక్షన్ లో ‘బాహుబలి ఎటర్నల్ వార్’ పేరుతో ఒక యానిమేటెడ్ మూవీ తెరకెక్కుతోంది. అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళ లోకానికి వెళుతోంది. అక్కడ ఇంద్రుడికి విశసూరుడికి మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఒక యానిమేషన్ టీజర్ రిలీజ్ అయింది…రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యానిమేషన్ సినిమా చాలా కొత్త స్క్రిప్ట్ తో వస్తున్నట్టుగా తెలుస్తోంది.
2027 వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… బాహుబలి ఆ లోకంలో ఎలాంటి విన్యాసాలు చేశాడు. ఎలా తన శక్తిని ప్రూవ్ చేసుకున్నాడు అనేది ఈ సినిమా యొక్క కోర్ పాయింట్ గా తెలుస్తోంది… ఇక టీజర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందు యానిమేషన్ తో భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా వచ్చిన ‘మహా అవతార్ నరసింహ’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా కూడా అదే రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
బాహుబలి అనే పేరుకు ఎంత బ్రాండ్ వాల్యూ ఉందో మనందరికి తెలిసిందే. దాన్ని వాడుకుంటూ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇషాన్ శుక్లా దీన్ని ఒక అద్భుత దృశ్య కావ్యంగా మార్చబోతున్నట్టుగా తెలుస్తోంది…టీజర్ లోని విజువల్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కానీ బాహుబలి గా ప్రభాస్ ను చూసిన తర్వాత యానిమేషన్ లో ప్రభాస్ ను చూడటం కొంచెం ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది…టీజర్ లో ప్రభాస్ వాయిస్ డబ్బింగ్ లో అంత స్పష్టత కనిపించలేదు… ప్రభాస్ గ్రేస్ తగ్గినట్టుగా అనిపించింది…ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే మరో సంవత్సర కాలం పాటు వెయిట్ చేయక తప్పదు…