Mana Shankara Vara Prasad Garu 8 days collections: ఈ సంక్రాంతికి విడుదలైన 5 సినిమాల్లో నాలుగు సినిమాలకు సంక్రాంతి పండుగ ముగిసిపోయింది. కానీ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) కి మాత్రం ఇంకా పండగ అయిపోలేదు. వరుసగా వారం రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ డిజిట్ షేర్ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్లిన ఒక సినిమా, కచ్చితంగా వర్కింగ్ డే లో బాగా డౌన్ అయిపోతుందని అంతా అనుకుంటారు. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మాత్రం 8వ రోజు, అనగా రెండవ సోమవారం రోజున కూడా అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్స్ నమోదు చేసుకుంది. ఫలితంగా ఈ చిత్రం 8వ రోజున 5 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. నైజాం ప్రాంతం లో కాస్త వసూళ్లు తగ్గుముఖం పట్టాయి కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం జోరు అసలు తగ్గలేదు.
ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రానికి 8 రోజుల్లో 40.15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 8 వ రోజున ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఊపు చూస్తుంటే ఈ ప్రాంతం నుండి ఈ చిత్రం కచ్చితంగా ఈ జనవరి 26 లోపు 50 కోట్ల షేర్ మార్కుని అందుకునేలా అనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఇక్కడ 57 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, మెగా ఫ్యామిలీ కి ఆ ప్రాంతం లో మొట్టమొదటి 50 షేర్ సినిమాగా నిలబడింది. ఇప్పుడు రెండవ మెగా సినిమా కూడా ఈ మార్కుని అందుకుంది. ఇక రాయలసీమ ప్రాంతం విషయానికి వస్తే, ఇక్కడ ఈ చిత్రం 8 రోజుల్లో 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కోస్తాంధ్ర నుండి 62.35 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 11.13 కోట్లు, ఓవర్సీస్ నుండి 18.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 151 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 240 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి ఇప్పటికే 30 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. మరో 30 కోట్ల రూపాయిల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని దంచికొట్టే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా సోమవారం రోజున రిపబ్లిక్ డే అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం. మేకర్స్ ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుందంటూ ప్రచారం చేస్తున్నారు కానీ, జనవరి 26 వరకు ఆ ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
