Mana Shankara Vara Prasad Garu 2 Days Collections: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం వసూళ్లు రోజురోజుకి ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వస్తున్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి 84 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు మేకర్స్, కానీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాకు కేవలం 74 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా రెండవ రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మేకర్స్ 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. అది కేవలం పబ్లిసిటీ పోస్టర్స్ మాత్రమేనని, నిజమైన వసూళ్లు రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని అంటున్నారు.
తక్కువ స్క్రీన్స్ లో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు రెండు రోజుల్లో రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక షేర్ వసూళ్ల విషయానికి వస్తే రెండవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 12 కోట్ల 30 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, గుంటూరు జిల్లా నుండి 94 లక్షల రూపాయిలు, కృష్ణా జిల్లా నుండి 86 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రాయలసీమ ప్రాంతం నుండి కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఉత్తరాంధ్ర నుండి 1 కోటి 85 లక్షలు రాబట్టింది. ఇక తూర్పు గోదావరి జిల్లా నుండి 90 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 60 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 34 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఇంచుమించుగా ఈ చిత్రానికి 12 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు భోగి పండుగ కావడం తో నిన్నటి మీద భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ చిత్రానికి కెపాసిటీ సమస్యలు వస్తున్నాయి. అంటే డిమాండ్ కి తగ్గ థియేటర్స్ లేవు. ఉన్న థియేటర్స్ లో 17 వ తేదీ వరకు టికెట్ ముక్క కూడా లేదు. షోస్ పెంచమని పెద్ద ఎత్తున అభిమానుల నుండి ఒత్తిడి పెరుగుతోంది. మరి మేకర్స్ షోస్ ని పెంచుతారో లేదో చూడాలి. ఇదే రేంజ్ జోరు ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మాత్రం ఈ చిరం 350 కోట్ల గ్రాస్ ని ఫుల్ రన్ లో అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.