Mana Shankar Varaprasad Garu Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ముఖ్యంగా సీనియర్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. గత సంవత్సరం వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ సినిమాతో చిరంజీవి 350 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే అంచనాలో ట్రేడ్ పండుతులైతే ఉన్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట చిరంజీవి నుంచి రాబోయే సినిమాలన్నీ కూడా 500 కోట్ల మార్కు ను టచ్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన టార్గెట్ చేసి మరి కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు…బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సిస్టర్ సెంటిమెంటుతో వస్తుంది. కాబట్టి ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది.
మరోసారి 2027 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసి భారీ సక్సెస్ ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఈ సినిమా సైతం కమర్షియల్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండబోతోంది. కాబట్టి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…
ఈ సినిమాలో డిఫరెంట్ మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి… అనిల్ రావిపూడి మెగా అభిమానులకు మాట ఇచ్చినట్టుగానే తన మాట నిలబెట్టుకున్నాడు. చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందిస్తానని సినిమా స్టార్టింగ్ రోజు చెప్పిన అనూప్ రావిపూడి అదే మాటకి కట్టుబడి మెగాస్టార్ చిరంజీవికి భారీ సక్సెస్ అయితే కట్టబెట్టాడు…