Mammootty: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన చెల్లెలు అమీనా కన్నుమూశారు. 70 ఏళ్ల అమీనా కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆమె పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారని తెలుస్తుంది. మమ్ముట్టి చెల్లులు మృతి వార్త తెలుసుకున్న మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది.
రోజుల వ్యవధిలో మమ్ముట్టి కుటుంబంలో ఇది రెండో విషాదం. ఇటీవలే మమ్ముట్టి తల్లిగారు మరణించారు. మమ్ముట్టి చెల్లెలు అమీనాకు భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. అమీనా మృతి నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఉన్న మమ్ముట్టి ఇటీవల 72వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా మూవీ ప్రకటించారు.
భ్రమ యుగం టైటిల్ తో ఈ చిత్రం విడుదల కానుంది. డీగ్లామర్ లుక్ లో భ్రమ యుగం ఫస్ట్ లుక్ ఆసక్తి రేపింది. దశాబ్దాలుగా మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఉన్నారు. తెలుగులో కూడా ఆయనకు ఇమేజ్ ఉంది. స్వర్ణకమలం, యాత్ర వంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల అఖిల్ ఏజెంట్ మూవీలో కీలక రోల్ చేశాడు.
ఇక మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ సైతం హీరోగా రాణిస్తున్నాడు. గత ఏడాది సీతారామం మూవీతో భారీ హిట్ కొట్టాడు. మహానటి, సీతారామం చిత్రాలు దుల్కర్ కి టాలీవుడ్ లో ఇమేజ్ తెచ్చిపెట్టాయి. దుల్కర్ సల్మాన్ మలయాళంలో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేస్తున్నారు.