Mamitha Baiju : గత ఏడాది విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని చిత్రంగా ఈ సినిమా ఆడియన్స్ నుండి మార్కులు సంపాదించింది. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన మామితా బైజు(Mamitha Baiju) కి యూత్ లో ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో ఈ బ్యూటీ రవితేజ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటూ టాక్ వినిపిస్తుంది కానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం ఆమె తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ హీరో గా నటిస్తున్న ‘జన నాయగన్’ లో నటిస్తుంది. ఇది మన తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ అనే విషయం తెలిసిందే.
Also Read : హీరో విశ్వక్ సేన్ తో వివాదం గురించి నాని సంచలన వ్యాఖ్యలు!
అందులో శ్రీలీల పోషించిన క్యారక్టర్ ని మమిత బైజు చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే మమిత ఇప్పుడు మరో సెన్సేషనల్ ఆఫర్ ని దక్కించుకుంది అంటూ సోషల్ మీడియా లో ఒక టాక్ నడుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో ‘డ్రాగన్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టుకుంది ఈ చిత్రం. ఇందులో మమిత ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది బలంగా టాక్ వినిపిస్తుంది. అదే కనుక జరిగితే ఆమె రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది అందంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చిత్రం పాన్ వరల్డ్ స్పాన్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ రుక్మిణి వాసంత్ నటిస్తుంది. మరి మమిత బైజు మరో హీరోయిన్ గా నటిస్తుందా?, లేదా ఏదైనా స్పెషల్ క్యారక్టర్ లో కనిపించబోతుందా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా 18 కిలోలు తగ్గాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గోవా లో శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ లోపు షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారట. ప్రశాంత్ నీల్ లాంటి ఊర మాస్ డైరెక్టర్, ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేత రవి శంకర్ గతంలో ఓకే ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. దేవర లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కచ్చితంగా ఆకాశాన్ని అంటే అవకాశాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఎన్టీఆర్ పుట్టినరోజున టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : నాని హిట్ 3 సినిమాలో కిచ్చా సుదీప్ కూతురు.. ట్రైలర్ లో మీరు గమనించారా..