Malleswari Movie Child Artist
Malleswari Movie Child Artist: 2004లో విడుదలైన మల్లీశ్వరి సూపర్ హిట్. దర్శకుడు కే విజయ భాస్కర్ తెరకెక్కించాడు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సునీల్, బ్రహ్మానందం, నరేష్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.
కామెడీ, ఎమోషన్, లవ్, రొమాన్స్ కలగలిపి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ దర్శకుడు విజయ భాస్కర్ రూపొందించారు. వెంకటేష్-విజయ భాస్కర్ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సూపర్ హిట్ కాగా, మరోసారి మల్లీశ్వరితో హిట్ కొట్టారు.
ఈ మూవీలో నరేష్ వెంకటేష్ అన్నయ్య పాత్ర చేశాడు. పెళ్లి కాని ప్రసాద్ గా వెంకటేష్ నటించాడు. ఇక నరేష్ కూతురు పాత్ర చేసింది గ్రీష్మ నేత్రిక. ఈ పాప ఇన్నోసెంట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. మల్లీశ్వరి అనంతరం పలు చిత్రాల్లో గ్రీష్మ నేత్రిక చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ చేసింది.
Malleswari Movie Child Artist Greeshma Nethrikaa Transmissions
అమ్ములు, ప్రస్థానం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, అశోక్, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరావచ్చు చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె నటనకు దూరంగా ఉంటుంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నట్లు సమాచారం.
గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందని పలువురు సెర్చ్ చేస్తున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్న గ్రీష్మ నేత్రికను చూసి అవాక్కు అవుతున్నారు. అప్పటి చిన్నపాప ఇంత అందంగా తయారైందా అని ఆశ్చర్యపోతున్నారు. గ్రీష్మ నేత్రిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
అలాగే ఆమె త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన గ్రీష్మ నేత్రిక హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకునే అవకాశం లేకపోలేదు.
Web Title: Malleswari movie child artist greeshma nethrikaa transmissions
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com