Chiranjeevi: చిరంజీవి సినిమాని చూసి హోమ్ మినిస్టర్ పదవి నుండి తప్పుకున్న రాజకీయ నాయకుడు అతనేనా?

రుద్రవీణ'. వరుసగా కమర్షియల్ మాస్ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరో గా మంచి ఇమేజి తో ముందుకు దూసుకుపోతున్న సమయంలో ఇలాంటి సినిమా చిరంజీవి నుండి రావడంతో అభిమానులకు తీసుకోవడం కాస్త కష్టం గా మారింది.

Written By: Vicky, Updated On : August 23, 2024 8:12 pm

Chiranjeevi(1)

Follow us on

Chiranjeevi: కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు, ఆయన సినిమాలు కూడా జనాలను ఎంతో ప్రభావితం చేస్తాయి అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి ఉదాహరణలలో ఒకటి ‘రుద్రవీణ’. వరుసగా కమర్షియల్ మాస్ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరో గా మంచి ఇమేజి తో ముందుకు దూసుకుపోతున్న సమయంలో ఇలాంటి సినిమా చిరంజీవి నుండి రావడంతో అభిమానులకు తీసుకోవడం కాస్త కష్టం గా మారింది. కానీ సినిమాకి మాత్రం విమర్శకుల ప్రశంసలే దక్కడమే కాకుండా, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ చిత్రానికి మెగా బ్రదర్ నాగ బాబు నిర్మాతగా వ్యవహరించాడు. కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నాగబాబు కి నష్టాలు వచ్చాయి. కానీ ఇంత గొప్ప సినిమా తెలుగు సినీ పరిశ్రమకి అందించినందుకు గాను, నాగబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు విశ్లేషకులు.

ఇకపోతే ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని ఒక రాజకీయ నాయకుడు హోమ్ మినిస్టర్ రేస్ నుండి తప్పుకున్నాడట. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు, మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు దేశంలో ఎన్నడూ లేని విధంగా, మన ఆంధ్ర ప్రదేశ్ లో 13 వేల గ్రామా పంచాయితీలలో ఒకేసారి గ్రామసభలను నిర్వహించారు. ఈ గ్రామసభలకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పాల్గొన్నారని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ సభల ద్వారా, గ్రామాల్లో ఉండే సమస్యలన్నిటికీ తీర్మానం చేసుకొని, సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేసేలా పవన్ కళ్యాణ్ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. స్వయంగా పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరులో ఒక గ్రామంలో నిర్వహించిన సభలో పాల్గొన్నాడు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరూ నన్ను ఉప ముఖ్యమంత్రితో పాటు, హోమ్ మినిస్టర్ పదవిని తీసుకోమని ఒత్తిడి చేసారు. కానీ నేను తీసుకోలేదు. అందుకు కారణం పంచాయితీ రాజ్ శాఖ మీద నాకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగానే. అన్నయ్య గారి ‘రుద్రవీణ’ సినిమాని మీరంతా చూసే ఉంటారు. అన్నా హజారే జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా అది. ఒక గ్రామా సర్పంచ్ గా ఉన్న అన్నా హజారే, ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి దేశం మొత్తం ఆ గ్రామం వైపు చూసేలా పోరాడాడు. పంచాయితీ వ్యవస్థలకు సర్పంచులు అంత బలంగా ఉంటే గ్రామాలూ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతాయి. అందుకే నేను గ్రామాలను పటిష్టం చేసే ఉద్దేశ్యంతోనే హోమ్ మినిస్టర్ పదవి ని తీసుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అలా మెగాస్టార్ చిరంజీవి తీసిన ‘రుద్రవీణ’ చిత్రం పవన్ కళ్యాణ్ ని ఆలోచింపచేసి, తనమన్సులో గ్రామాలపై మక్కువ పెరిగేందుకు భీజం వేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆయన మాటలు వింటుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో, సమాజంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి అనేది అర్థం అవుతుంది.